రెచ్చగొట్టేవారు నాయకులు కారు.. పవన్

Update: 2016-02-01 11:34 GMT
రెచ్చగొట్టడం నాయకత్వం లక్షణం కాదు... భావోద్వేగాలు రెచ్చగొడితే జనం విరుచుకుపడతారు.. అది సహజం... నాయకులు ఆ పని చేయకూడదని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ సూచించారు. ఉద్యమ నాయకులు చాలా బాధ్యత వహించాలని, ఉద్యమ స్ఫూర్తి పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. కొందరు పకడ్బంధీగా హింసను ప్రేరేపించార ని అన్నారు. లక్షల మంది వస్తున్నప్పుడు శాంతిభద్రతల సమస్య వస్తుందని ప్రభుత్వం ఎందుకు ఊహించలేదన్నారు. తుని ఘటనపై దర్యాప్తు జరపాలని కోరారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
   
బిసిలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేష్లు ఇవ్వగలిగితే ఇస్తామని చెప్పండని, లేకుంటే ఇవ్వలేకపోతే అదే విషయం చెప్పాలని పవన్ కళ్యాణ్  ప్రభుత్వానికి సూచించారు. తెలుగుదేశం పార్టీ కాపుల రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారని అందువల్ల కాపులలో అసహనం ఉంటుందని జనసేన కళ్యాణ్ అన్నారు. గతంలో దీనిపై కమిషన్ లు వేసినా ప్రయోజనం కలగలేదని ,వారిలో ఈ భావన ఏర్పడి వారు ఈ సభ జరిపారని అన్నారు.ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ఉంటే ఎలా ఉండేదో అని అన్నారు.ఈ సమస్యకు అన్ని పార్టీలు సమన్వయంతో దీనిపై అవగాహనకు రావాలని అన్నారు.లేకుంటే కులాల మధ్య విబేదాలకు దారి తీస్తుందన్నారు.     ఇలాంటి విషయంలో ప్రతి రాజకీయ పార్టీ బాద్యతగా వ్యవహరించాలని పవన్ అన్నారు.ప్రభుత్వం పంప్రదింపులు జరిపి పరిస్థితి చేయి దాటకుండా చేయాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.
Tags:    

Similar News