ఏం జేస్తివి ప‌వ‌న్ క‌ల్యాణ‌..2

Update: 2015-08-24 13:06 GMT
అంతేకాదు.. రైతుల‌తో మాట్లాడిన సంద‌ర్భంగా ఒక చ‌క్క‌టి సూచ‌న‌ను ప‌వ‌న్ చేశారు. రైతులు వెలుబుచ్చిన అభ్యంత‌రాల్ని ప‌రిశీలించి.. వారికి ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉండేలా మేధావుల‌తో కూడిన ఒక బృందం ఏర్పాటు చేసి ఉంటే బాగుండేద‌ని చెప్పారు. లోక్ సత్తా జేపీ లాంటి వారితో ఇలాంటి బృందాన్ని ఏర్పాటు చేసి ఉండాల్సిందన్నారు. ఇలాంటి సూచ‌న‌లు ఇప్పుడు చేయ‌టం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నమైనా ఉందా? అన్న‌ది ఒక  ప్ర‌శ్న‌.

ఇక‌.. పెనుమాక‌.. ఉండ‌వ‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల్లోని రైతులు లేవ‌నెత్తిన అతి ముఖ్య‌మైన స‌మ‌స్య.. భూమి విలువ అంశం. తుళ్లూరులో ఎక‌రం రూ.8 నుంచి రూ.15ల‌క్ష‌లు ప‌లికితే.. దాని విలువ ఇప్పుడు రూ.50 నుంచి రూ.60 ల‌క్ష‌లు అవుతుంద‌ని.. అదే స‌మ‌యంలో రాజ‌ధాని ప్ర‌క‌టించ‌క ముందే.. త‌మ భూముల విలువ ఎక‌రం రూ.5కోట్లు అని.. ఇప్పుడు దాని విలువ రూ.కోటిన్న‌ర‌కు ప‌డిపోయింద‌ని.. మ‌రోవైపు.. రోజుకు రూ.5వేలు సంపాదించి పెట్టే భూమిని ఏడాదికి రూ.50వేల కౌలు కింద ఇస్తామంటే ఎలా ఇస్తామ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. న్యాయంగా ఆలోచిస్తే.. వారి వాద‌న క‌రెక్టే.

ప‌వ‌న్ చెప్పిన‌ట్లుగా మేధావుల బృందం లాంటిది క‌నుక చంద్ర‌బాబు ఏర్పాటు చేసి ఉంటే.. ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు ఒక చ‌క్క‌టి ప‌రిష్కారం చూపించేవారేమో. నిజానికి ఇలాంటి వాటి విష‌యంలో బాబు స‌ర్కారు కాస్త ముంద‌స్తు క‌స‌రత్తు చేసి ఉంటే బాగుండేదేమో. హైద‌రాబాద్‌నే తీసుకుంటే జూబ్లీహిల్స్ ధ‌ర‌.. మాదాపూర్ కి ఉండ‌దు. మాదాపూర్ లో ఉండే ధ‌ర చందాన‌గ‌ర్ కు ఉండ‌దు. చందాన‌గ‌ర్‌లో ఉండే ధ‌ర దిల్‌షుక్ న‌గ‌ర్ లో ఉండ‌దు. దిల్ షుక్ న‌గ‌ర్‌లో ఉండే ధ‌ర హ‌యత్ న‌గ‌ర్‌లో ఉండ‌దు.  ఇదే తీరులో ఏపీ రాజ‌ధాని ప‌రిస్థితి కూడా. ఇలాంట‌ప్పుడు.. ఏపీ రాజ‌ధానిగా ఎంపిక చేసిన ప్రాంతంలోని భూముల ధ‌ర‌ల‌కు త‌గ్గ‌ట్లుగా ప్లాన్ రూపొంచింది ఉంటే బాగుండేది. అంటే.. రూ.8 నుంచి రూ.15ల‌క్ష‌లు ఎక‌రం ప‌లికే తుళ్లూరుకు రూ.50ల‌క్ష‌లు అయ్యేలా ప్ర‌యోజ‌నం క‌ల్పించిన ఏపీ స‌ర్కారు రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌కు ముందే రూ.5కోట్లు ప‌లికే భూముల్ని అంత‌కుమించి ధ‌ర అయ్యేలా రూపొందించి.. ఆ భూములున్న వారికి ప‌రిహారంగా ఇస్తామ‌ని చెప్పి ఉంటే తుళ్లూరు ప్ర‌జ‌లు ఆనంద ప‌డిన‌ట్లుగా ఉండ‌వ‌ల్లి వాసులు ఓకే అనేవారేమో. అదే జ‌రిగి ఉంటే అస‌లు స‌మ‌స్యే ఉండేది కాదేమో.

అంటే..భూముల విలువ ఆధారంగా అక్క‌డ వ‌చ్చే ప్రాజెక్టుల‌ను ఎంపిక చేయ‌టం ద్వారా.. భూముల ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు ఉన్న‌ప్ప‌టికీ.. ఆ భూముల య‌జ‌మానులు మాత్రం సంతోష‌ప‌డేవారు. అలాంటి క‌స‌ర‌త్తు జ‌ర‌గాల్సి ఉన్నా.. జ‌ర‌గ‌కుండానే పోయింది. ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. స‌ల‌హాలు ఇవ్వ‌ను.. అప్పుడ‌ప్పుడు మాత్రం నిల‌దీస్తాన‌ని చెప్ప‌టం స‌బ‌బుగా లేదు.

 రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారం తుది ద‌శ‌కు చేరుకున్న త‌ర్వాత ఈ రోజున వ్య‌వ‌హారం ర‌చ్చ‌కు వ‌చ్చింది. ఒక‌విధంగా చూస్తే.. ప‌వ‌న్ నిన్న చెప్పిన మాట‌.. ప్ర‌భుత్వానికి వార్నింగ్ లాంటిదే. మ‌రి.. దాన్ని చంద్ర‌బాబు ఓకే చేస్తారా? లేదంటే.. ఇగోకు  పోయి ప‌వ‌న్ ను లైట్ అంటారా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌.

ఇక్క‌డ‌.. స‌మ‌స్య ప‌వ‌న్ ను లైట్ అన‌టం.. బాబు ఇగో ప్ర‌ద‌ర్శించ‌టం వ‌ల్ల అంతిమంగా న‌ష్ట‌పోయేది అమాయ‌క రైతుల‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారంలో  అటు ప‌వ‌న్‌కు కానీ.. చంద్ర‌బాబుకు కానీ వ్య‌క్తిగ‌తంగా న‌ష్టం అనేది ఏమీ ఉండ‌దు. వారి బ్యాంకు బ్యాలెన్స్ లు ఏమీ త‌ర‌గ‌వు. కానీ.. ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యంతో ఏ మాత్రం తేడా వ‌చ్చినా మొద‌ట బ‌ల‌య్యేది అమాయ‌క రైతులే.

త‌న పాల‌సీల‌తో.. త‌న అల‌వాట్ల‌తో ప‌వ‌న్ త‌న ప‌రిధి దాట‌కుండా.. ప‌రిమితుల‌తో ఉండ‌టం వ‌ల్ల న‌ష్ట‌పోయేది ఆయ‌న్ని న‌మ్ముకున్న వారు మాత్ర‌మే. రోజూ ఇంట్లో ఉండే ప‌వ‌న్ కొడుక్కి అర్థ‌మవుతుంది.. త‌న తండ్రిని అడిగితే త‌ప్ప స‌ల‌హా ఇవ్వ‌డ‌ని. కానీ.. ఎప్పుడో కానీ క‌నిపించని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆలోచ‌న‌ల గురించి  అమాయ‌క ప్ర‌జ‌ల‌కు ఏం తెలుస్తుంది..? ప‌వ‌న్ క‌ల్యాణ్ లోప‌ల ఇన్ని రిజ‌ర్వేష‌న్లు ఉన్నాయ‌ని. పిచ్చిగా అభిమానించ‌టం.. వెర్రిగా ఆరాధించ‌టం.. లాజిక్ లేకుండా న‌మ్మేయ‌టం త‌ప్ప‌.. వారికి ప‌వ‌న్ వ్య‌క్తిగ‌తంగా ఎలా ఉంటారు? ఎలా ఆలోచిస్తారు? ఆయ‌న ఏ విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు లాంటివి తెలియ‌వు క‌దా.

మ‌రి.. అలాంటి ప్ర‌జ‌ల్నిత‌న ఇష్టాయిష్టాల‌కు.. అల‌వాట్ల‌తో ప‌వ‌న్ ఇబ్బంది పెట్ట‌కూడ‌దు క‌దా. య‌న‌మ‌ల వ్యంగ్యంగా వ్యాఖ్యానించార‌ని రైతుల స‌మ‌స్య‌ల్ని వినేందుకు వ‌చ్చిన‌ట్లుగా ప‌వ‌న్ వైఖ‌రి ఉంది. అంటే.. ఎవ‌రో ఒక‌రు ప‌వ‌న్ ఇగోను హ‌ర్ట్ చేస్తే బ‌య‌ట‌కు వ‌స్తారా? ప్ర‌జాజీవితంలోకి వ‌చ్చేవారు.. ప్ర‌జ‌ల ఈతి బాధ‌ల గురించి మ‌న‌స్ఫూర్తిగా ఆలోచించాల‌ని అనుకునేవారు నిత్యం వారితో క‌లుపుగోలుగా ఉండాలి. ఒక‌వేళ అది సాధ్యం కాకున్నా.. అలాంటి ఒక వ్య‌వ‌స్థ‌ను రూపొందించుకొని.. క్షేత్ర‌స్థాయిలోని విశేషాల్ని తెలుసుకుంటూ ఉండాలి. ఒక ప్ర‌ముఖ ప‌త్రికాధిప‌తి రాసిన ఎడిటోరియ‌ల్ కాల‌మ్ లో త‌న‌కు కులాభిమానం ఉంద‌ని ప‌రోక్షంగా రాయ‌టాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించి.. దానికి వివ‌ర‌ణ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కు.. రాజ‌ధాని రైతుల బతుకులపై ప్ర‌భావితం చేసే రాజ‌ధాని కోసం రూపొందించిన భూస‌మీక‌ర‌ణ చ‌ట్టంలోని అంశాల్ని ఎందుకు టక‌ట‌కా ఎందుకు చెప్ప‌టం లేదు?

ఒక సామాన్య రైతు.. చ‌ట్టంలోని సెక్ష‌న్ల గురించి చ‌క‌చ‌కా ప్ర‌స్తావిస్తూ.. అందులోని లోపాల్ని ఎత్తి చూపిస్తున్న‌ప్పుడు.. ఆశ్చ‌ర్యంతో ప‌వ‌న్ వినిపించ‌టం టీవీ స్క్రీన్ల మీద స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. త‌న మీద కుల‌ముద్ర వేయ‌టాన్ని ఎక్క‌డో ఒక ప‌త్రిక‌లో లోప‌లి పేజీల్లోని ఒక వ్యాసంలో నాలుగు లైన్ల విష‌యంలో అంత పట్టింపుతో ఉన్న ప‌వ‌న్‌.. ల‌క్ష‌లాది జీవితాలను ప్ర‌భావితం చేసే ఒక చ‌ట్టం గురించి.. అందులోని అంశాల గురించి ఎందుకు అధ్య‌య‌నం చేయ‌లేదు.?

ఎందుకంటే.. అది ఆయ‌న‌కు నేరుగా ప్ర‌భావితం చేసే అంశం కాదు కాబ‌ట్టి. అదే త‌న మీద కుల‌ముద్ర వేస్తే మాత్రం ఆయ‌న స‌హించ‌లేక‌పోయారు. ఎందుకంటే.. అది ఆయ‌న‌కు నేరుగా న‌ష్టం చేస్తుంది కాబ‌ట్టి. మంచిత‌నానికి నిలువెత్తు రూపంగా ఉండాల‌ని అనుకునే ప‌వ‌న్‌.. కొన్ని అంశాల మీద దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉందన్న‌విష‌యం మ‌ర్చిపోకూడ‌దు.

మొత్తంగా చెప్పాలంటే.. రాజ‌ధాని భూముల వ్యవ‌హారంలో చంద్ర‌బాబు త‌న‌కున్న రాజ‌కీయ అనుభవాన్ని ప‌క్క‌న ప‌డేసి త‌ప్పులు చేస్తే.. ఆయ‌న‌కు బానిస కాని మిత్రుడైన ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం త‌న‌కు తెలీకుండానే చాలా త‌ప్పులు చేసేశారు. విషాదం ఏమిటంటే.. తెలిసి త‌ప్పులు చేసిన చంద్ర‌బాబుకు.. తెలీకుండా త‌ప్పులు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కార‌ణంగా అంతిమంగా న‌ష్ట‌పోయేది మాత్రం అమాయ‌క రైతులే. 
Tags:    

Similar News