కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు దగ్గరయ్యేందుకు - గత కొద్దికాలంగా జనసేన అధ్యక్షుడు - సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఇందుకోసం ఆయన ఢిల్లీ వెళ్లారని కూడా పలువురు పేర్కొన్నారు. అయితే, తాజాగా పవన్ చేసిన కామెంట్లు - ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురించి ఆయన చేసిన విశ్లేషణ...పవన్ కేంద్రంగా జరుగుతున్న ప్రచారం నిజమనిపించేలా ఉందంటున్నారు.
ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పవన్ ప్రశంసలు కురిపించారు. గతంలో తాను రెండుమూడు సందర్భాల్లో దక్షిణాది - ఉత్తరాది వ్యత్యాసాన్ని ప్రస్తావించానని - దక్షిణ భారత ప్రజల ఆకాంక్షలను జాతీయ స్థాయి నాయకత్వం అర్థం చేసుకోవాలన్నానని పవన్ గుర్తు చేశారు. అయితే, అలాంటి పరిస్థితులు లేకపోవడం వల్ల ఇప్పుడు చర్చనీయమైన పరిణామాలు జరుగుతున్నాయని పవన్ తెలిపారు. ``భారతదేశం విభిన్న సంస్కృతులు - భిన్నమైన ప్రాంతాలు - భాషలు - ఆచార వ్యవహారాల సమాహారం. వీటిని ఏకత్వంలోకి తీసుకురావాల్సి ఉంది. భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి నాయకత్వం కృషి చేయలేకపోవడం వల్ల అంతరాలు అలాగే ఉన్నాయి. కొంతమంది రాజకీయ లబ్ది కోసం ఈ అంతరాలను పెంచేశారు. పెంచేస్తూ ఉంటారు కూడా. నేను ఈ అభిప్రాయాలనే 2014లో అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి - ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి తెలియచేశాను. మీలాంటి బలమైన వ్యక్తులు ఉన్నంతకాలం ఫర్వాలేదు గానీ బలహీనమైన వ్యక్తులు పాలనలోకి వచ్చినప్పుడు ఉత్తర - దక్షిణ అనే వేర్పాటువాదాలు వస్తాయి... వీటిపై దృష్టి సారించాలని చెప్పాను`` అని పవన్ వివరించారు.
ఈ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని సైతం పవన్ ప్రస్తావించారు. ``కశ్మీర్ ను దేశంలో అంతర్భాగం చేసిన తరుణంలో దేశ భాష సంస్కృతులను దెబ్బ తీసి - సమగ్రతకు భంగం కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ భారతదేశాన్ని సంస్కృతిపరంగా విడదీయడానికి ఒక తాత్త్విక భూమికను తయారు చేస్తున్నారని విశ్రాంత డీజీపీ అరవిందరావు చెప్పిన విషయంపై ప్రధానమంత్రి గారు - కేంద్ర హోమ్ మంత్రి ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తగిన విధంగా స్పందించాల్సి ఉంది.`` అని పవన్ విశ్లేషించారు.