పవన్ బాగానే వాడేసుకుంటున్నాడే..

Update: 2018-04-20 17:30 GMT
శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అన్న బూతు మాట ఎంతటి వివాదానికి దారి తీసిందో తెలిసిందే. అది పవన్ కళ్యాణ్ అభిమానుల్ని తీవ్రంగా హర్ట్ చేసింది. మెగా ఫ్యామిలీ నుంచి కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నాగబాబు మాత్రమే కాదు.. అల్లు అరవింద్ సైతం ప్రెస్ మీట్ పెట్టి పవన్ ను టార్గెట్ చేసిన వాళ్లపై విరుచుకుపడ్డాడు. సాయిధరమ్ తేజ్.. వరుణ్ తేజ్ లాంటి వాళ్లు ఆల్రెడీ పవన్ మద్దతుగా స్పందించారు. ఈ రోజు అల్లు అర్జున్ సైతం పవన్ కు మద్దతుగా బరిలోకి దిగాడు. మొత్తానికి ఈ వివాదం నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అంతా ఏకతాటిపైకి వచ్చింది. పవన్ కు మద్దతుగా నిలిచింది. ఇది మెగా ఫ్యామిలీ అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే.

ఇక ఈ గొడవ పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా చాలా మేలు చేసిందనే చెప్పాలి. పవన్ కు ఈ ఇష్యూలో సినీ వర్గాల నుంచి కూడా అనూహ్యమైన మద్దతు లభించింది. జనాల్లోనూ పవన్ మీద ఒక సానుభూతి కనిపించింది. పవన్ ఏం మాట్లాడాడని శ్రీరెడ్డి అంత మాట అంది.. దీని వెనుక కుట్ర ఉందన్న అన్న అభిప్రాయాలు అందరిలోనూ కలిగాయి. ఈ క్రమంలోనే పవన్ కు మద్దతు.. అతడిపై సానుభూతి రెండూ కనిపించాయి. దీనిపై వెంటనే స్పందించకుండా మౌనం వహించడం ద్వారా పవన్ వ్యూహాత్మకంగానే వ్యవహరించాడు. అది అతడి ఇమేజ్ ను పెంచింది. మొత్తంగా ఈ గొడవ పవన్ కు పరోక్షంగా మేలు చేసిందనే చెప్పాలి. రాజకీయాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్న పవన్ ఈ రోజు తనలోని ఆవేశాన్ని కూడా బయటపెట్టాడు. పవన్ నుంచి చాలామంది ఇలాంటి ఆవేశాన్ని.. దూకుడునే కోరుకుంటున్నారు. ఇది కూడా పవన్ రాజకీయాభిమానులకు ఆనందం కలిగిస్తోంది. సరైన సమయంలో పవన్ స్పందించి.. ఈ ఇష్యూను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి.. మైలేజ్ పెంచుకోవడానికి ఉపయోగించుకుంటుండటం ఆయన మద్దతుదారులకు ఆనందాన్నిస్తోంది. ఉత్సాహం పెంచుతోంది.
Tags:    

Similar News