జ‌న‌సేన ఎంపీ అభ్య‌ర్థిగా అన్న‌య్య‌?

Update: 2019-03-12 13:10 GMT
ఏపీలో రాజ‌కీయం హాట్ హాట్ గా మారింది. ఎప్పుడు ఏ పార్టీ త‌ర‌ఫున ఎవ‌రు పోటీ చేస్తారో అర్థం కాని ప‌రిస్థితి. అధికార తెలుగుదేశం.. విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కాదు.. ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థులుగా కొత్త కొత్త పేర్లు తెర మీద‌కు వ‌స్తున్నాయి. తాజాగా అలాంటి పేరు ఒక‌టి ప్ర‌చారంలోకి వ‌చ్చి ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

తాజాగా బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం జ‌న‌సేన‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ప‌వ‌న్ కుటుంబ స‌భ్యుల జోక్యం లేక‌పోవ‌టం తెలిసిందే. దీనికి భిన్నంగా ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు జ‌న‌సేన ఎంపీ అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. జ‌న‌సేన పార్టీ పెట్టిన వేళ ప‌వ‌న్ సోద‌రుడు చిరుతో పాటు.. నాగ‌బాబు కూడా త‌మ్ముడికి దూరంగా ఉండ‌టం తెలిసిందే. కుటుంబంలో అంద‌రి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నా.. ఒంట‌రిగా జ‌న‌సేన పార్టీని ఏర్పాటు చేయ‌టం.. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. ఎన్నిక‌ల బ‌రిలో దిగే అభ్య‌ర్థులకు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ల్ని ఒక్కొక్క‌టిగా వెల్ల‌డిస్తున్న జ‌న‌సేన‌.. త్వ‌ర‌లో నాగ‌బాబు అభ్య‌ర్థిత్వంపైనా అధికార ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని చెబుతున్నారు. 

ఏపీ ఎన్నిక‌ల బ‌రిలో జ‌న‌సేన పోటీ చేస్తున్నా.. మిగిలిన జిల్లాల‌తో పోలిస్తే గోదావ‌రి జిల్లాలోనే ఎక్కువ సీట్లు సొంతం చేసుకునే వ్యూహాన్ని ప‌వ‌న్ సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతారు. త‌న‌కు పెద్ద‌గా బ‌లం లేని జిల్లాల మీద ఫోక‌స్ చేయ‌ని ప‌వ‌న్‌.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల మీద ప్ర‌త్యేక దృష్టి పెట్టి.. రెండు జిల్లాల నుంచి వీలైన‌న్ని ఎక్కువ ఎంపీ.. అసెంబ్లీ స్థానాల్ని సొంతం చేసుకోవాల‌న్న యోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతారు.

దీనికి త‌గ్గ‌ట్లే ప‌వ‌న్ తాజాగా త‌న అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు దిమ్మ తిరిగేలా న‌ర‌సాపురం ఎంపీ స్థానానికి జ‌న‌సేన అభ్య‌ర్థిగా త‌న సోద‌రుడు నాగ‌బాబును దింపాల‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. దీనికి నాగ‌బాబు కూడా ఓకే అన్న‌ట్లు చెబుతున్నారు. చిరంజీవి పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌ని నాగ‌బాబు.. త‌న త‌మ్ముడు పార్టీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌టానికి ఓకే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. త‌మ పురిటిగ‌డ్డ అయిన గోదావ‌రి జిల్లాల్లో కొన్ని అసెంబ్లీ స్థానాల‌తో పాటు.. ఎంపీ స్థానాన్ని కైవ‌శం చేసుకోవ‌టం ద్వారా ఏపీ ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌క‌భూమిక పోషించాల‌ని జ‌న‌సేన ఆశిస్తోంది. అందులో భాగంగానే నాగ‌బాబును తెర మీద‌కు తెచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ప‌వ‌న్ వ్యూహం ఓకే. మ‌రి.. దీనికి ఓట‌ర్లు ఎలాంటి స‌మాధానం ఇస్తారో చూడాలి.


Tags:    

Similar News