అవసరమైతే వైసీపీతో పొత్తు పెట్టుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారని వైసీపీ మాజీ ఎంపీ వర ప్రసాద్ వ్యాఖ్యానించినట్లు కొన్ని న్యూస్ చానెళ్లలో గతంలో వెలువడిన వార్తా కథనాలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వర ప్రసాద్ ఆ విషయం వెల్లడించారని - అధికారికంగా బయటపెట్టేందుకు నిరాకరించారని ఓ వార్తా చానెల్ కథనం ప్రసారం చేసింది. హోదా కోసం జనసేన - వైసీపీలు కలిసి పనిచేస్తాయని - 2019 ఎన్నికల తర్వాత వైసీపీకే పవన్ మద్దతు ఉంటుందని వరప్రసాద్ వ్యాఖ్యానించారనేది ఆ కథనం సారాంశం. తనను కలవాలని వరప్రసాద్ కు పవన్ స్వయంగా ఫోన్ చేశారని - జగన్ ను కలిసేందుకు కూడా పవన్ ప్రయత్నించారని ఆ కథనంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి వైసీపీ-జనసేనల పొత్తుపై వరప్రసాద్ స్పందించారు. వైసీపీతో పొత్తుకు పవన్ ప్రయత్నించిన మాట వాస్తవమేనని వరప్రసాద్ అన్నారు.
వైసీపీతో పవన్ పొత్తు విషయంలో గతంలో వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు నేడు క్లారిటీ లభించింది. రేణిగుంట రైల్వేస్టేషన్లో మీడియాతో మాట్లాడిన వరప్రసాద్ ఆ వ్యాఖ్యలను ధృవీకరించారు. వైసీపీతో కలిసేందుకు పవన్ ప్రయత్నించారని - వరప్రసాద్ అన్నారు. టీడీపీ - చంద్రబాబు అవినీతి పాలన నచ్చకపోవడంతో...రాబోయే ఎన్నికల్లో జగన్ కు మద్దతు తెలిపేందుకు పవన్ సిద్ధపడ్డారని చెప్పారు.తాను టీడీపీలో లేనని, అవసరమైతే జగన్ కు మద్దతిచ్చేందుకు కూడా తాను సిద్ధమని పవన్ తనతో అన్నారని వరప్రసాద్ తెలిపారు. అవినీతిలో చంద్రబాబు ముందంజలో ఉన్నారని వరప్రసాద్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో జగన్ తోనే జనం నడుస్తారని, వైసీపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం పవన్ పోరాట యాత్రపై విజయసాయిరెడ్డి కూడా పాజిటివ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు కీలక నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ...2019 ఎన్నికలకు ముందు....లేదా తర్వాత వైసీపీతో జనసేన పొత్తు ఉండబోతోందన్న ఊహాగానాలకు మరింత ఊతం లభించింది.