రాజకీయంలో మహామహా కాకలు తీరిన ఉద్దండులే ఎదురు దెబ్బలు తిని విలవిలాడుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అనుభవరాహిత్యంతో ఇద్దరు ఏపీలో ఇద్దరు ఉద్దండులను ఢీకొనే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత మౌనంతో రాజకీయాన్ని గెలిచినా తర్వాత అదే మౌనంతో విమర్శలు ఎదుర్కొన్నారు. తర్వాత నోరు విప్పినా... కర్రవిరగని-పాము చావని రాజకీయాలతో అటు అధికార పక్షంతోనూ, ఇటు ప్రతి పక్షంతోనూ తిట్లు తిన్నారు. రాష్ట్రమంతా పదేపదే అతను ముసుగు తీసే ప్రయత్నంలో ఇటీవలే తన అసలు రూపాన్ని బయటపెడుతున్నారు. ఆయన మాటల్లో మాత్రం రాష్ట్రం కోసమే అన్నట్టు ఉన్నా ఫక్తు రాజకీయ ఉద్దేశాలే అన్ని వ్యాఖ్యల్లో కనిపిస్తున్నాయి. కాలం గడిచినా పార్టీ నిర్మాణం లేకపోగా నిరంతరం ఇతరుల మీద ఆధారపడుతూనే వస్తున్నాడు. తాజాగా ఈరోజు వామపక్షాలతో సమావేశం అయ్యారు.
ఈరోజు సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ పలు విషయాలపై స్పందించారు. అందులో ఒకటి జేడీ లక్ష్మీ నారాయణ అంశం. పవన్ అభిమానులు ఆయనను శిఖరంలా భావిస్తుంటే పవన్ మాత్రం ప్రతి అడుగులోనూ తన డిపెండెన్సీని ప్రదర్శించుకుంటున్నారు. సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అతను రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే, ఏ పార్టీలోకి చేరతారు అనే ఊహా ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. నిజానికి లక్ష్మీనారాయణ మాత్రం దీనిపై ఏ వ్యాఖ్య చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ అతనికి ఏకంగా రెడ్ కార్పెట్ వేయడానికి రెడీ అయిపోయారు. మీడియాతో మాట్లాతూ . *గతంలో మేమిద్దరం ఓసారి కలిశామని - జనసేన పార్టీ ఆవిర్భావం రోజున లక్ష్మీనారాయణ తనకు సందేశం పంపించారని చెప్పారు. తనకు బెస్టాఫ్ లక్ కూడా చెప్పారన్నారు. తర్వాత 2-3 సార్లు ఎస్సెమ్మెస్ కూడా పంపించారని ఉత్సాహంగా చెప్పారు.
నిజానికి రాష్ట్రంలో ప్రస్తుతం ఆయన గురించి అభిమానులు - మీడియా చేస్తున్న హైప్ కి పవన్ స్పందన వేరేలా ఉండాల్సింది. కానీ ఆయన కోసం పవనే తాపత్రయ పడుతున్నట్టు కనిపిస్తోంది. అనుభవం గురించి జగన్ ను ప్రశ్నించిన పవన్ ఏ అనుభవం లేకుండా పార్టీ ఎలా నడుపుతున్నాడు.. దానికి అనుభవం వద్దా అని కూడా జనం సెటైర్లు వేస్తున్నారు. పవన్ తన తొందరపాటు - అసంపూర్ణ జ్ఞానంతో ప్రతిసారీ అడుగులు వేయడంలో తడబడుతున్నారు.