జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ

Update: 2018-05-14 10:00 GMT
నిన్నటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కాలి నడకన అలిపిరి నుంచి తిరుమలకు పవన్ చేరుకోవడం.. మధ్యలో తీవ్ర అలసటకు గురై కూలబడినట్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. మంచి ఫిట్నెస్ ఉన్నట్లుగా కనిపించే పవన్ ఇంతలా డీలా పడిపోతాడని ఎవ్వరూ అనుకోలేదు. ఆయన కుర్చీలో కూలబడి ఉన్న ఫొటో.. దీపం వెలిగించడానికి కూడా కష్టపడిపోతున్న వీడియో నిన్నట్నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పాటుగా పవన్ సింప్లిసిటీని సూచించే ఫొటోలు కూడా చర్చనీయాంశంగా మారాయి.

ఒక చోట పవన్ కూర్చుని ఉంటే పక్కన ఒక కుక్క ఉంది. దాని పైనే చెత్త కుండీ కూడా ఉంది. అవేవీ పట్టించుకోకుండా పవన్ మామూలు వ్యక్తి లాగే కూర్చుని తన అభిమానులతో ముచ్చటించాడు. మొత్తంగా ఈ ప్రయాణంలో పవన్ సింప్లిసిటీ గురించి కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. కొందరేమో ఈ మాత్రం దానికే పవన్ అలా అలసిపోయి కుంగిపోతే.. ఇక జనాల మధ్యన ఏం తిరుగుతాడు.. ఏం యాత్రలు చేస్తాడు అని విమర్శలు గుప్పిస్తున్నారు. త్వరలోనే తాను యాత్ర చేయబోతున్నట్లు పవన్ ఈ పర్యటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే హడావుడిగా ప్రకటనలు గుప్పించి తర్వాత వెనక్కి తగ్గే అలవాటున్న పవన్.. ఈ యాత్రలు సిన్సియర్ గా చేస్తాడన్న ఆశలేమీ సామాన్య ప్రజల్లో  కనిపించడం లేదు.
Tags:    

Similar News