ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీలో ఇప్పుడు అందరూ యూటర్న్ బాబులుగానే మారిపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. యూటర్న్ తీసుకోవడంలో తనకు తానే సాటి అంటూ నిరూపించేసుకున్న ఆ పార్టీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... నాలుగేళ్ల పాటు చెలిమి చేసిన బీజేపీపై ఇప్పుడు విమర్శలను కొనసాగిస్తున్నారు. తనకు తానుగా తన నోటి ద్వారానే ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పిన చంద్రబాబు... బీజేపీతో కటీఫ్ తర్వాత అదే ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ సర్కారు ఏపీకి తీరని అన్యాయం చేసిందంటూ తనదైన శైలిలో యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ తీసుకునే విషయంలో అసలు ప్రజలు తమనేమనుకుంటారన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు... అసలు యూటర్న్‌లో తనను మించిన వారే లేరని కూడా నిరూపించి చూపారు. అయినా ఇప్పుడు బాబు యూటర్న్ విషయాన్ని మరోమారు ఎందుకు ప్రస్తావించుకోవాల్సిన అవసరం వచ్చిందన్న విషయానికి వస్తే... టీడీపీ నేతలంతా ఇప్పుడు పార్టీ అధినేత బాటలోనే పయనిస్తూ... యూటర్న్ తీసుకుంటున్నారు.
ఈ జాబితాలో ఇప్పుడు ఓ కొత్త నేత వచ్చి చేరాడు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చినా... ఇప్పటిదాకా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగని పరిటాల రవీంద్ర - సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్... ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. గతంలో జనసేన అథినేత పవన్ కల్యాణ్ తో చాలా చెలిమి ఉన్నట్లుగా చెప్పుకోవడంతో పాటుగా అనంతపురం పర్యటనకు వచ్చిన పవన్ ను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించిన పరిటాల కుటుంబం... ఆయనకు దగ్గరుండి మరీ స్వయంగా వడ్డించింది. మంత్రి పరిటాల సునీతతో పాటు దివంగత పరిటాల రవి వారసుడి హోదాలో పరిటాల శ్రీరామ్ కూడా పవన్ పక్కనే కూర్చుని మరీ కొసరికొసరి వడ్డించిన వైనం మరిచిపోలేనిదే. అయితే పవన్ టీడీపీతో చెలిమికి స్వస్తి చెప్పి... టీడీపీ అవినీతి పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. నేరుగా చంద్రబాబు - లోకేశ్ లనే టార్గెట్ చేసుకుని పవన్ చేస్తున్న ఆరోపణలు నిజంగానే సంచలనంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు సైలెంట్‌గానే ఉన్న టీడీపీ శ్రేణులు ఆ తర్వాత బాబు మాదిరే యూటర్న్ తీసుకుని పవన్‌ను టార్గెట్ చేస్తూ ప్రతి విమర్శలకు దిగాయి.
పార్టీ అధినేత - నేతల మాదిరే తాను కూడా యూటర్న్ తీసుకోగలనని నిరూపించుకున్న పరిటాల శ్రీరామ్... తాజాగా పవన్ పై తనదైన శైలి విమర్శలు చేశారు. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారంటూ పవన్ పై పరిటాల వారసుడు అంతెత్తున ఎగిరిపడ్డారు. తన సొంత జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగించిన సందర్భంగా పరిటాల శ్రీరామ్... నేరుగా పవన్ పేరును ప్రస్తావించడంతో పాటుగా ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. టీడీపీ పక్కనే ఉంటూ పవన్ కల్యాణ్ వెన్నుపోటు పొడిచారని పరిటాల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు మిత్రుడిగా ఉన్న పవన్...ఇపుడు తమను విమర్శించడం ఏమిటని మండిపడ్డారు. టీడీపీకి వ్యతిరేకంగా పవన్ మాట్లాడి... సీఎం చంద్రబాబును ఇరుకున పెట్టాలని చూస్తున్నారని తనదైన శైలి ఆరోపణలు గుప్పించారు. బీజేపీ - వైసీపీలకు తోడుగా...ఇపుడు జనసేన నుంచి పవన్ కూడా చంద్రబాబును విమర్శించేందుకు వచ్చారన్నారు. మొత్తంగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగకుండానే టీడీపీ నేతగా పరిటాల శ్రీరామ్... తాను కూడా తమ పార్టీ అధినేత చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోనని, తాను కూడా యూటర్న్ తీసుకోవడంలో సిద్ధహస్తుడినేనని నిరూపించుకున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.