ప‌వ‌న్ ప్ర‌చారానికి హెలికాఫ్ట‌ర్ రెఢీ!

Update: 2019-03-13 05:23 GMT
కేవ‌లం 30 రోజులు. అప్పుడే మూడు రోజులు గ‌డిచిపోయాయి. ఇంకా జాబితా సిద్ధం కాలేదు. దానికో మూడు రోజులు ప‌ట్ట‌నుంది. ఆ త‌ర్వాత నామినేష‌న్ల ప్ర‌క్రియ‌.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇప్పుడున్న 27 రోజులు ఇట్టే గ‌డిచిపోయే ప‌రిస్థితి. కీల‌క‌మైన ఎన్నిక‌ల ప్ర‌చారం కొండ‌లా ఉన్న వేళ‌.. మిగిలిన ప‌నులు పెద్ద ఎత్తున ఉన్న నేప‌థ్యంలో భారీ ఎత్తున ఎన్నిక‌ల‌ ప్ర‌చారం చేసేందుకు వీలుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హెలికాఫ్ట‌ర్ సాయాన్ని తీసుకోనున్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని రేపటి (గురువారం) నుంచి షురూ చేయ‌నున్న ఆయ‌న‌.. తొలి స‌భ‌ను రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. త‌న తొలి స‌భ‌కు యుద్ధ శంఖారావం పేరుతో పెట్టిన ఈ స‌భ అనంత‌రం వ‌రుస పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తార‌ని చెబుతున్నారు. త‌న ప్ర‌చారానికి సంబంధించి పార్టీ నేత‌ల‌కు క్లారిటీ ఇచ్చిన ప‌వ‌న్‌.. ప్ర‌చార ప్రణాళిక‌ల్ని సిద్ధం చేయాల‌ని కోరారు.

రోజుకు త‌క్కువ‌లో త‌క్కువ 3 చోట్ల స‌భ‌లు ఉండేలా ప్లాన్ సిద్ధం చేయాల‌ని.. క‌నీసం 70కు పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న స‌భ‌లు ఉండేలా చూడాల‌ని కోరిన‌ట్లు చెబుతున్నారు. హెలికాఫ్ట‌ర్ సాయంతో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ను చేప‌ట్టాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఓవైపు స‌భ‌లు.. మ‌రోవైపు రోడ్డు షోల‌లో ఆయ‌న పాల్గొనాల‌ని భావిస్తున్నారు.  ఎన్నిక‌ల బ‌రిలో దిగే అభ్య‌ర్థుల జాబితాను దాదాపుగా క‌న్ఫ‌ర్మ్ చేశార‌ని.. చివ‌రిగా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌ని చెబుతున్నారు.

ఈ రోజు (బుధ‌వారం) నుంచి వ‌రుస‌గా జాబితాను ప్ర‌క‌టించేలా ప‌వ‌న్ ప్లాన్ చేశారు. ఇదిలా ఉండ‌గా.. క‌మ్యునిస్టుల‌తో పొత్తు పెట్టుకోవ‌టానికి ఆస‌క్తిగా ఉన్న ప‌వ‌న్‌.. వారు కోరిన నియోజ‌క‌వ‌ర్గాల్ని వారికి కేటాయించేందుకు మాత్రం సిద్ధంగా లేర‌ని తెలుస్తోంది. జ‌న‌సేన ఎక్క‌డైతే బ‌లంగా ఉందో ఆ స్థానాల్ని క‌మ్యునిస్టులు త‌మ‌కు కేటాయించాల‌ని కోర‌టాన్ని ప‌వ‌న్ త‌ప్పు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో కామ్రేడ్స్ తో సీట్ల స‌ర్దుబాటు వ్య‌వ‌హారం మ‌రో రెండు రోజుల్లో ఒక కొలిక్కి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. మ‌రి.. ప‌వ‌న్ సుడిగాలి ప్ర‌చారం ఏమేర‌కు సాయంగా నిలుస్తుందో చూడాలి.  


Tags:    

Similar News