రాజధాని మార్పు: 30న పవన్ కు విపత్కర పరిస్థితే?

Update: 2019-12-28 10:48 GMT
ఏపీ సీఎం జగన్ ప్రకటించిన మూడు రాజధానుల పై ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా మౌనంగా ఉండిపోయారు. ఈనెల 30న జనసేన పార్టీ సమావేశం తర్వాతే దీని పై స్పందిస్తాడట..

అయితే ఇప్పటికే ఆయన సొంత అన్నయ్య చిరంజీవి అభివృద్ధి వికేంద్రీకరణకు జై కొట్టారు. విశాఖను పరిపాలన రాజధాని మంచి నిర్ణయం అంటూ కొనియాడిన సంగతి తెలిసిందే.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి జగన్ నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు. ఈ చర్య విశాఖను మరింత అభివృద్ధి సాధించేలా చేస్తుందని.. అక్కడ సినిమా పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందన్నారు.

అయితే జగన్ తీసుకున్న మూడు రాజధానులపై మొదట స్పందించిన పవన్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక్క అమరావతికే దిక్కులేదని మూడు రాజధానులట అని ట్విట్టర్ లో ఆడి పోసుకున్నారు. పవన్ వ్యాఖ్యలు ఆయన అన్నయ్య చిరంజీవి వ్యాఖ్యల మధ్య వైరుధ్యం  స్పష్టంగా కనపడింది.

పవన్ ప్రస్తుతం రష్యా టూరు ముగించు కొని హైదరాబాద్ వస్తున్నారు. 30న విజయవాడలో జనసేన కార్యవర్గం సమావేశమవుతున్నారు. ఇప్పుడు ఆయన సొంత అన్నయ్య వ్యాఖ్యలనే కంట్రోల్ చేయలేని పవన్ ఎలా అధికారపక్షం, ప్రజల ముందర కవర్ చేస్తారు.. తన వాదన ఎలా వినిపిస్తారు..? రాజధాని మార్పును ఎలా వ్యతిరేకిస్తారన్నది ఆసక్తిగా మారింది.


Tags:    

Similar News