జ‌నసేన దిశ‌ను మార్చే నిర్ణ‌యం తీసుకున్న ప‌వ‌న్‌

Update: 2017-12-10 04:46 GMT
పార్టీ బ‌లోపేతానికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న జ‌న‌సేన పార్టీ అధినేత - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ క్ర‌మంలోనే మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే ఇటు హైద‌రాబాద్‌ లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో ఐటీ సెంట‌ర్ స‌హా అన్ని మౌళిక స‌దుపాయాలు పూర్తి చేసిన జ‌న‌సేనాని...ఏపీలో కూడా కొత్త కార్యాల‌యాన్ని సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు కార్య‌క‌ర్త‌ల ఎంపిక‌ - పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల బాధ్యుల‌ని ఎంపిక‌ చేయ‌డం వంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఏపీలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేప‌ట్టిన ప‌వ‌న్‌...పార్టీ నేత‌ల్లో ఓ ఊపు తెచ్చిన సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా పార్టీ దిశ‌ను మార్చే నిర్ణ‌యాన్ని తీసుకున్నారు ప‌వ‌న్‌.

త‌న వ‌రుస ప‌ర్య‌ట‌నల ద్వారా పార్టీ నేత‌ల్లో జోష్ నింపిన జ‌న‌సేనాని ఇదే ఉత్సాహాన్ని కొన‌సాగించేలా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మార్చి 14 - 2018న జ‌న‌సేన ప్లీన‌రీని నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పార్టీ కార్యక‌ర్త‌ల‌కు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 2019 ఎన్నిక‌ల్లో వీలైన‌న్నీ ఎక్కువ స్థానాల్లో పోటీచేయ‌నున్న‌ట్లు చెప్పిన జ‌న‌సేనాని..ఇందుకోసం పార్టీ నేత‌లు - కార్య‌క‌ర్త‌లు సిద్ధంగా ఉండాల‌న్నారు. ఇదిలాఉండ‌గా...జన‌సేన పార్టీ త‌ర‌ఫున ఇప్ప‌టికే పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల ఎంపికకు సిద్ధ‌మైంది. 20 మంది నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంపిక చేసిన‌ట్లు త్వ‌ర‌లోనే వారి పేర్ల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు జనసేన అధినేత జిల్లాల పర్యటన ముగిసింది. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌ ఒంగోలులో పడవ ప్రమాద బాధితులను పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. ఫెర్రీ ఘటనకు మంత్రి అఖిలప్రియ బాధ్యత వహించాలన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్‌.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చురకలు అంటించారు. చాలా కాలం తర్వాత మరోసారి ప్రజా క్షేత్రంలోకి వచ్చిన పవన్‌ కళ్యాణ్‌... నాలుగో రోజు...  కృష్ణా జిల్లా పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఒంగోలు ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో వారిని కలిసి ఓదార్చారు. ప్రమాదం గురించి మృతుల బంధువులు పవన్‌ కు వివరించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. దీంతో పాటుగా డీసీఐ కార్మికుల‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించారు.
Tags:    

Similar News