జనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనతో కలిసివచ్చే నాయకుల గురించి ప్రశంసల జల్లు కురిపించారు. వివిధ జిల్లాల్లో జనసేన సైనికుల కోసం ఎంపికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎంపిక ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించిన పవన్ స్వచ్ఛమైన పౌరసమాజం కోసం యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. శిబిరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ కలుస్తానని పవన్ హామీ ఇచ్చారు.
జనసేన శిబిరాలలో పాల్గొన్న స్పీకర్లు - కంటెంట్ రైటర్లు - అనలిస్టుల సిస్టులు - వీడియో రికార్డులను హైదరాబాద్ లోని జనసేన పరిపాలన కార్యాలయంలో ఆయన స్వయంగా విశ్లేషించారు. తెలుగు రాష్ట్రాలలో జనసేన ఏర్పాటు చేస్తున్న "ఔత్సాహికుల వేదిక"లలో పాల్గొన్నవారి ప్రతిభా ప్రదర్శనను పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ పరిశీలించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిశీలన మరికొన్ని రోజులు కొనసాగుతుంది. బలమయిన - స్వచ్చమయిన పౌరసమాజం ఏర్పాటు కావాలంటే యువతీ యువకులు, మేధావులు కలసికట్టుగా పనిచేయాలన్న తలంపుతో ఈ వేదికలను ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు జరిగిన శిబిరాల రికార్డులను ఆయన చూసారు. జులై నాటికి ఈ ప్రక్రియ పూర్తవతుందని, ఆ తరువాత ఒక ప్రణాళిక ప్రకారం ఈ శిబిరాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ కలుస్తానని చెప్పారు. ఈ శిబిరాలలో పాల్గొన్నవారందరికీ పేరు పేరున పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/