రైలు - బ‌స్సు.. నెక్స్ట్ ఏంటి ప‌వ‌న్‌?

Update: 2018-11-24 06:25 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ మ‌ధ్య విజ‌య‌వాడ నుంచి తుని వ‌ర‌కు చేప‌ట్టిన రైలు యాత్ర తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ప‌వ‌న్ రైలెక్క‌డంతో జ‌నం ఆయ‌న్ను చేసేందుకు విర‌గ‌బ‌డ్డారు. రైల్వేస్టేష‌న్ల‌లో తొక్కిస‌లాట జ‌రిగినంత ప‌నైంది. సాధార‌ణ ప్ర‌యాణికులు తీవ్రంగా ఇబ్బందిప‌డ్డారు. అభిమానుల తాకిడి ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలిసినా అదేమీ ప‌ట్టించుకోకుండా ప్ర‌చారం కోసం ప‌వ‌న్ రైలెక్క‌డ‌మేంట‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే - నాటి విమ‌ర్శ‌ల నుంచి ప‌వ‌న్ పాఠ‌మేదీ నేర్చుకున్న‌ట్లు క‌నిపించ‌డం లేద‌ని విమ‌ర్శ‌కులు మ‌రోసారి మండిప‌డుతున్నారు.

అందుకు కార‌ణం- ప‌వ‌న్ శ‌నివారం బ‌స్సు యాత్ర చేప‌ట్ట‌బోతుండ‌టం. ఆయ‌న‌ రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకు పల్లె వెలుగు బస్సులో ప్రయాణిస్తూ గిరిజనుల కష్టాలు తెలుసుకోబోతున్న‌ట్లు జ‌న‌సేన ప్ర‌క‌టించింది. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ప‌వ‌న్ ఫ్ర‌యాణం ప్రారంభ‌మ‌వుతుంద‌ని - సాయంత్రం రంప‌చోడ‌వ‌రంలో బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని వెల్ల‌డించింది.

ప‌వ‌న్ తాజా ప్ర‌యాణ ప్ర‌ణాళిక‌పై ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. జ‌న‌సేన అధినేత త‌న ప్ర‌చార జిమ్మిక్కుల‌తో ప్ర‌యాణాలు చేస్తున్నార‌ని.. దాని వ‌ల్ల సామాన్య ప్ర‌జ‌ల‌కు ఎదుర‌య్యే ఇబ్బందుల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నిజంగా గిరిజ‌నుల స‌మస్య‌లు తెలుసుకోవ‌డ‌మే ప‌వ‌న్ ఉద్దేశ‌మైతే నేరుగా గిరిజ‌న ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌వ‌చ్చు క‌దా అని ప్ర‌శ్నిస్తున్నారు. అలా వెళ్లలేక బ‌ద్ధ‌కంతోనే ప‌వ‌న్ రైలు యాత్ర‌ - బ‌స్సు యాత్ర‌ల పేరుతో హాయిగా కూర్చొని ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని ఆరోపించారు.

ప‌వ‌న్ బ‌స్సులో వెళ్లే విష‌యం ఇప్పుడు అంద‌రికీ తెలిసిపోయింది. కాబ‌ట్టి ఆ బ‌స్సు వెంట ఆయ‌న అభిమానులు, జ‌నసేన కార్య‌క‌ర్త‌లు వేలాదిగా త‌ర‌లివ‌చ్చి సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు, వాహ‌నాల రాక‌పోక‌ల‌కు ఇబ్బంది క‌లిగించే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు. రైలు, బ‌స్సు ప్ర‌యాణం అయిపోయాక టూ వీల‌ర్‌పై తిరుగుతావా ప‌వ‌న్ అంటూ చురుకలు వేస్తున్నారు. ప‌బ్లిసిటీ కోసం త‌యారుచేసుకుంటున్న ఇలాంటి టూర్స్ అండ్ ట్రావెల్స్ కాన్సెప్ట్‌ల‌ను ప‌వ‌న్ ఇక‌నైనా వ‌దిలేయ‌డం మంచిద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.


Tags:    

Similar News