తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సకల జనభేరి పేరుతో తమ గలం వినిపించిన ఆర్టీసీ కార్మికులు మరో ముందడుగు వేశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో టీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలిశారు. గత 27 రోజులుగా జరుగుతున్న సమ్మె వివరాలను - తమ డిమాండ్లను వివరించారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించిందని - సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఆర్టీసీ సమస్య పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారు.
జేఏసీ నేతలతో చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... ``27 రోజుల ఉద్యమంలో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాను రాను సమస్య పీటముడిలా మారి కొలిక్కిరాకుండా పోయింది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల మద్దతు - వారు చేసిన పోరాటం తీసిపారేయలేనివి. ఆర్టీసీ కార్మికుల బాధలు ప్రభుత్వ పెద్దలు అర్ధం చేసుకోవాలని కోరుతున్నాం. సోషలిస్ట్ డెమోక్రసీ విధానాన్ని అవలంభించే మన దేశంలో ప్రతి ఒక్కరికీ తమ బాధను చెప్పుకునే హక్కు ఉంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం అవసరం. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభించాలని కోరుకుంటున్నాం. `` అని తెలిపారు.
అతిత్వరలోనే కేసీఆర్ ను కలుస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ``నవంబర్ 3వ తేదీ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నాం. విశాఖపట్నం వెళ్లే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తాను. ఆయన్ని కలసి కార్మికుల సమస్యలు వివరిస్తాను. వారి 24 డిమాండ్లు కేసీఆర్ దృష్టిలో పెడతాను. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరపాలని, సానుకూలంగా స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని విన్నవిస్తాం. ఆయనతో మాట్లాడే అవకాశం రాని పక్షంలో కార్మిక నాయకుల భవిష్యత్ ప్రణాళికకు సంపూర్ణ మద్దతు తెలుపుతాం` అని తెలిపారు.
``తెలుగుదేశం పార్టీ హయాంలో బషీర్ బాగ్ కాల్పుల ఘటన జరిగిన సమయంలో రైతుల ఆవేదన ఎంతగా కలచివేసిందో - ప్రస్తుత సమస్య కుడా నన్ను అంతే కలచివేస్తోంది. ఇప్పుడే కె.చంద్రశేఖర్ రావు అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నం చేస్తాను. కె.కేశవరావు - కేటీఆర్ - హరీష్ రావు - ఎర్రబెల్లి దయాకర్ రావుకు వ్యక్తిగతంగా మెసేజ్ లు పంపుతాను. తెలిసిన నాయకులందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఆర్టీసీ కార్మికుల సమస్యలకు కేసీఆర్ ఒక పరిష్కార మార్గం సూచించాలని కోరుతున్నాం. అంతా కష్టాల్లో ఉన్నారు. 48 వేల మంది కార్మికులు మాత్రమే కాదు, వారి కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ని వేల కుటుంబాలు ఆకలితో బాధ పడడం ఎవరికీ మంచిది కాదు. సామరస్యపూర్వకంగా ఓ రాజీ మార్గం వెతకాలి. ఓ మహిళా కండక్టర్ కూడా చనిపోవడం బాధ కలిగిస్తోంది. భవిష్యత్తు ఉండదన్న నిరాశ - నిస్పృహలకు గురైనప్పుడే బతుకు మీద ఆశపోతుంది. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడ వద్దు సమస్య పరిష్కారానికి మా వంతు కృషి మేం చేస్తాం`` అని భరోసా ఇచ్చారు.
ఆర్టీసీ జేఏసీ నేతల భేటీతో కార్మికుల సమస్యల పట్ల పవన్ స్పందించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. నాయకుడిగా భరోసా ఇవ్వడమే కాకుండా పరిష్కారానికి సైతం కృషిచేయడం దీనికి కారణం. అయితే, పవన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తారా అనేది ప్రథమ ప్రశ్న. అంతేకాకుండా...ఒకవేళ ఇచ్చినా...పవన్ అభిప్రాయాలను కేసీఆర్ ఎంతమేరకు గౌరవిస్తారు..అనుసరిస్తారు అనేది అత్యంత ముఖ్యమైన అంశం. అన్నింటికీ మించి...టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మాయని మచ్చలా మిగిలిన `బషీర్ భాగ్ కాల్పులు` అంశంతో ఆర్టీసీ సమ్మెను పోల్చిన నేపథ్యంలో...గులాబీ దళపతి జనసేనాని ప్రయత్నంపై ఎలా స్పందిస్తారనే ఆసక్తి సహజంగానే...నెలకొంది.