'నిల‌క‌డ' కోసం.. ఇంత క‌ష్ట‌ప‌డాలా?

Update: 2023-01-13 04:38 GMT
శ్రీకాకుళం వేదిక‌గా.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్వ‌హించిన యువ శ‌క్తి స‌భ‌లో ప్ర‌సంగించిన వారి తాప‌త్ర‌యం గ‌మ‌నిస్తే... నిల‌క‌డ కోసం..చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. జ‌బర్ద‌స్త్ ఫేం.. ఆది నుంచి మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌, నాగ‌బాబు వ‌ర‌కు అంద‌రూ కూడా ''నిల‌క‌డైన రాజ‌కీయాలు చేస్తారు.. నిల‌క‌డైన రాజ‌కీయాలు చేస్తారు''- అంటూ.. ప‌వ‌న్‌ను స‌మ‌ర్ధించే ప్ర‌య‌త్నం చేశారు.

ఆది అయితే.. ఈ విష‌యంలో ఒకింత వోవ‌ర్‌గా నే వ్య‌వ‌హ‌రించాడ‌ని ప‌వ‌న్ అభిమానులు కామెంట్లు చేయ డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి రాష్ట్రంలో అనేక పార్టీలు వ‌చ్చాయి. పోయాయి. కొన్ని పార్టీలు ఉన్నాయి.

అయితే.. ఎప్పుడూ ఏ పార్టీ కూడా ఇంత‌గా నిల‌క‌డ‌గా..కుదురుగా రాజ‌కీయాలు చేస్తాం.. అని చెప్పుకొన్న‌.. సంజా యిషీ ఇచ్చుకున్న ప‌రిస్థితి రాలేదు. కానీ, ఇప్పుడు జ‌న‌సేన వ్య‌వ‌హారం.. మాత్రం సంజాయిషీ ఇచ్చుకునే ప‌రిస్థితికి చేరింది.

దీనికి కార‌ణం.. ఏంటి? ఎందుకు? అంటే.. సింపుల్‌. పార్టీ నిర్మాణం పూర్తిగా జ‌ర‌గ‌క‌పోవ‌డం, క్షేత్ర‌స్థాయిలో పార్టీ ప‌రిస్థితి అస‌లు ఏమీ క‌నిపించ‌క‌పోవ‌డం.. ఎప్పుడో ప‌వ‌న్ వ‌స్తే.. పండ‌గ‌.. రాకుంటే దండ‌గ అన్న‌ట్టు గా రాజ‌కీయం ఉండ‌డం.. పార్టీలోనూ జోష్ ఇదే త‌ర‌హాలో మారిపోవ‌డం వంటివి.. 'నిల‌క‌డ'  అనే మాట వినిపించేలా చేసింది. కేవ‌లం పొత్తుల కోస‌మే పార్టీ ఉద్భ‌వించిన‌ట్టుగా.. కూడా వ్య‌వ‌హ‌రించ‌డం.. జ‌న‌సేన పై సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేసింది.  

ఈ ప‌రిణామాల‌కు చెక్ పెట్ట‌కుండా.. ఎన్నిసార్లు.. ఎంత‌మందితో నిల‌క‌డైన రాజ‌కీయాలు చేస్తారు.. నిఖార్స యిన రాజ‌కీయాలు చేస్తారు.. అంటూ చెప్పించినా.. ప్ర‌యోజనం ఉంటుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

క‌నీసం ఇప్ప‌టికైనా..క్షేత్ర‌స్థాయిలో పార్టీకి క‌మిటీలు వేయ‌డం.. బ‌లోపేతం చేయ‌డం, మండ‌లాల వారీగా.. నేత‌ల‌కు బాధ్య‌తలు అప్ప‌గించ‌డం వంటివి కీల‌కం. ఇవి చేయ‌కుండా.. పార్టీపై న‌మ్మ‌కం క‌లిగించాల‌ని అనుకోవ‌డం.. ప్ర‌య‌త్న‌మే అవుతుంది త‌ప్ప‌.. అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News