మళ్లీ పవన్ కి షాక్ ..జగన్ నిర్ణయానికి జై కొట్టిన రాపాక !

Update: 2020-01-04 05:09 GMT
జనసేన ..టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన ఈ పార్టీ 2019 లో జరిగిన ఎన్నికలలో కింగ్ మేకర్ గా నిలుస్తుంది అని అందరూ అనుకుంటే కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు గెలుచుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి విచిత్రం ఏమిటంటే ...పవన్ పోటీ చేసిన రెండు చోట్లా కూడా ఓడి పోవడం. ఇక పార్టీ ఎక్కువ స్థానాలని గెలవక పోయినా కూడా పవన్ రాజకీయంగా క్రియాశీలకంగానే ఉన్నారు. ఒకరకంగా టీడీపీ తో పోల్చుకుంటే జనసేన పార్టీ కి ఆ ఒక్క సీటు రావడం అనేది అద్భుతం అని చెప్పాలి. అయినప్పటికీ పవన్ ప్రజల తరపున తన గొంతు వినిపిస్తూనే ఉన్నారు.

కానీ , గత కొన్ని రోజులుగా జనసేన నుండి గెలిచినా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అంతగా పడటంలేదు అని అనిపిస్తుంది. ఎందుకు అంటే..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు రాజధానుల నిర్ణయం అనేది మంచిది కాదు అని , జగన్ సర్కార్ పై , సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పై ఒంటికాలి పై లేస్తుంటే... జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూనే ఉన్నారు. ఇంగ్లీష్‌ మీడియాన్ని పవన్ తప్పుబడితే.. వాటిని సమర్థిస్తూ సీఎం వైఎస్ జగన్‌ను వెనుకోసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇదే ఇంకా ఏపీలో హాట్ టాపిక్ గా ఉన్న తరుణంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.

మూడు రాజధానుల వ్యవహారం పై ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఈయన .. రాజధానికి సంబంధించిన అంశాలపై స్పందించారు. మూడు రాజధానుల నిర్ణయం సబబే నన్న ఆయన.. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే పెట్టి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విడిపోయిన తరువాత ఏపీ చాలా ఇబ్బందులని ఎదుర్కొంటుంది అని , ప్రజలకు మేలు జరుగుతుందంటే జనసేన మద్దతు తప్పకుండా ఇస్తుంది అని అన్నారు. ఒకవైపు జగన్ సర్కార్ నిర్ణయానికి మద్దతు ఇస్తూనే , రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని సూచించారు. తంలో బలవంతం గా రైతుల దగ్గర భూములు లాక్కున్నారని.. ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఇబ్బందేనని.. అమరావతి రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవైపు పవన్ అమరావతిలో రైతులకి నేనున్నా మీకు అంటూ చెప్తున్నా సమయంలో జనసేన ఎమ్మెల్యే ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి రాపాక వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.


Tags:    

Similar News