రాజ‌ధాని త‌ర‌లింపు పై సీమ‌, విశాఖ ప్ర‌జ‌లు సంతోషం గా లేరు: ప‌వ‌న్ తాజా వ్యాఖ్య‌లు

Update: 2020-01-08 10:06 GMT
రాజ‌ధాని అమ‌రావ‌తి లో రైతులు, మ‌హిళ‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చి శాంతి యుతంగా చేస్తున్న నిర‌స‌న‌లు, ఆం దోళ‌నల‌ను రెచ్చ‌గొట్ట‌ద్ద‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్.. వైసీపీ ప్ర‌భుత్వాన్ని హెచ్చరించారు. నిర‌స‌న కారుల‌పై చిన్న‌కాకాని వ‌ద్ద పోలీసులు అమానుషంగా ప్ర‌వ‌ర్తించార‌ని ప‌వ‌న్ విమ‌ర్శించారు. వైసీపీ ప్ర‌భు త్వం రైతులు చేస్తున్న ఆందోళ‌న‌ల‌కు రాజ‌కీయ రంగు పులుముతోంద‌ని  దుయ్య‌ బ‌ట్టారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఖ‌రి తో ఒక్క అమ‌రావ‌తి రైతులు, ప్ర‌జ‌లే కాకుండా విశాఖ‌, సీమ ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు కూడా సంతోషంగా లేర‌ని ప‌వ‌న్ తెలిపారు. విశాఖ ప్ర‌జ‌ల్లో ఏ ఒక్క‌రూ కూడా త‌మ ప్రాంతాన్ని రాజ‌ధాని గా చేయాల‌ని కోరుకోవ‌డం లేదన్నారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం... రాష్ట్రం లో ఓ మూల‌న ప‌డిన‌ట్టుగా ఉన్న ప్రాంతం కావ‌డ‌మేన‌ని ప‌వ‌న్ చెప్పారు. అంతేకాకుండా, విశాఖ‌ను రాజ‌ధానిగా ప్ర‌క‌టిస్తే.. లివింగ్ కాస్ట్ పెరిగిపోయి నానా ఇబ్బందులు ప‌డ‌తామ‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌తో ఉన్న‌ట్టు తెలిపారు. విశాఖ న‌గ‌ర‌మే కాకుండా చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లోనూ అద్దెలు స‌హా భూముల రేట్లు మ‌రింత పెరిగి సాధార‌ణ ప్ర‌జ‌ల జీవ‌నం అస్త‌వ్యస్తంగా మారే ప్ర‌మాదం ఉంద ని హెచ్చ‌రించారు. అదే స‌మ‌యంలో సీమ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం విలువ ఇవ్వాల‌ని , అర్ధం  చేసుకోవాల‌ని కోరారు.

విశాఖ‌ను రాజ‌ధానిగా ప్ర‌క‌టించే ప్ర‌య‌త్నాల‌ పై సీమ ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నార‌ని ప‌వ‌న్ తెలిపారు. సీమ ప్రాంతాల నుంచి విశాఖ‌కు వంద‌ల కిలో మీట‌ర్ల‌ దూరం ఉంటుంద‌ని, ఉదాహ‌ర‌ణ‌కు హిందూపురం నుంచి దాదాపు 800 కిలో మీట‌ర్ల దూరంలో విశాఖ ఉంద‌ని, ఇక్క‌డి ప్ర‌జ‌లు రాజ‌ధాని కి రావాలంటే న‌ర‌కం చ‌విచూస్తార‌ని ప‌వ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వైసీపీ నాయ‌కులు ఈ విష‌యం లో గుడ్డి గా వ్య‌వ‌హ‌రిస్తు న్నా ర‌ని ప‌వ‌న్ దుయ్య‌ బ‌ట్టారు.

గ్రామ / వార్డు స‌చివాల‌యాలు ప్ర‌జ‌ల‌కు చేరువ‌లోనే ఉన్న‌ప్పుడు ఇక‌, రాజ‌ధానిలో ప్ర‌జ‌ల‌కు ఏం అవ‌స‌రం ఉంటుంద‌ని వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నార‌ని, కానీ అన్ని అవ‌స‌రాలూ గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌తోనే స‌రిపోవ‌ని ప‌వ‌న్ చెప్పారు. దీంతో ప్ర‌జ‌ల‌కు న్యాయం చేకూర‌ద‌ని, పైగా స్థానికంగా అయితే, రాజ‌కీయ జోక్యం, ప్ర‌భావం ఉండి ప్ర‌జ‌లు న‌ష్ట‌పోతార‌ని ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


Tags:    

Similar News