పవన్ ఇపుడు బెబ్బులిలా ఉన్నారు. ఏపీ రాజకీయాల మీద ఆయన పూర్తిగా ఫోకస్ పెట్టేశారు. తాను ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. ఏపీలో రాజకీయాలను పూర్తి ఔపాసన పట్టేసిన పవన్ వచ్చే ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అంటూ వైసీపీని ఢీ కొట్టాలని నిర్ణయించుకున్నారు. అధి పొత్తులతో వస్తారా లేక వేరే ఎత్తులతో వస్తారా అన్నది పక్కన పెడితే వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేయడానికి పవన్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.
ఇప్పటిదాకా కోస్తా జిల్లాలలో తన బలాన్ని పెంచుకుంటూ వస్తున్న పవన్ ఈసారి రాయలసీమ నుంచే రణ నినాదం చేయడానికి రెడీ అవుతున్నారు అని తెలుస్తోంది. పవన్ రాయలసీమలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా మూలాలనే చెదరగొట్టి వైసీపీని ఇబ్బందుల్లో నెట్టాలని చూస్తున్నారుట.
రాయలసీమలో బలిజ జనాభా ఎక్కువ. వారంతా కూడా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా తమ వాటాను మాత్రం పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నారు అన్న అసంతృప్తి ఉంది అంటున్నారు. ఇపుడు ఆ సామాజికవర్గం అండతో సీమ జిల్లాల్లో తన రాజకీయమేంటో చూపించాలని పవన్ నిర్ణయించుకున్నారు అని తెలుస్తోది.
ఇక ఆయన జగన్ కోట అయిన పులివెందుల మీద కన్నేశారని, వచ్చే నెలలో అంటే నవంబర్ లో పవన్ పులివెందుల టూర్ చేస్తారని తెలుస్తోంది. కౌలు రైతు భరోసా యాత్రను పులివెందులలో చేపట్టడం ద్వారా ఏకంగా సీఎం నియోజకవర్గంలోనే సత్తా చాటాలని సంకల్పించారని అంటున్నారు.
అదే టైం లో పులివెందుల నడిబొడ్డున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాలని పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే పులివెందులలో పవన్ కళ్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు చూస్తున్నారు అని అంటున్నారు.
రానున్న రోజుల్లో సీమ నుంచే గట్టిగా సౌండ్ చేయడం ద్వారా ఏపీ అంతటా జనసేన బలం పెంచుకుని ఎన్నికల్లో విజయానికి సోపానాలు వేసుకోవాలని పవన్ మాస్టర్ ప్లాన్ తో ఉన్నారని అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ కసి మీద ఉన్నారు. తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. 2024లో రాజకీయం మొత్తం మార్చేస్తాను అంటున్నారు. మరి జగన్ కోటలో పవన్ రాజకీయ వేట ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది అంటున్నారు.