వేతన జీవులకు సుప్రీం కోర్టు గొప్ప శుభవార్త

Update: 2020-02-02 10:52 GMT
వేతన జీవులకు సుప్రీం కోర్టు గొప్ప శుభవార్త చెప్పింది. గ్రాడ్యుయేట్లు, రోజువారీ కూలీలు, క్లర్క్ లు, సూపర్ వైజర్లు, పలు రంగాల్లో పనిచేస్తోన్న వేతన జీవులందరికీ 19వేల కనీస వేతనం అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

మూడేళ్ల క్రితం ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను అమలు చేయాలని సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక గ్రాడ్యుయేట్లకు రూ.19వేలు కానుంది.

కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం 2017వ సంవత్సరంలో కార్మికులకు 37శాతం ఇంక్రిమెంట్ ను పెంచుతూ ఓ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ పెంపుపై అనేక సంస్థలు సుప్రీం కోర్టుకెక్కాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ కేసుపై తాజాగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం 19572 రూపాయలు అందజేయాలని కోరింది.


Tags:    

Similar News