పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం ప్రకటించిన అనంతరం అన్ని సంస్థలూ, వ్యాపారాలు కుదేలయ్యాయని నిన్నంతా కథనాలొచ్చాయి. ఏ భారీ కంపెనీలకు, ఏయే చిన్న వ్యాపారాలకు పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల భారీ దెబ్బ తగిలిందో - సెన్సెక్స్ పై ఆ ప్రభావం ఏస్థాయిలో ఉందో వచ్చిన కథనాల సరసన తాజాగా... ఒక సంస్థ భారీగా లాభ పడిందని వార్తలొస్తున్నాయి!
ఇప్పటికే మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై పేటీఎం హర్షం వ్యక్తం చేసింది. ఆన్ లైన్ పేమెంట్ సంస్థ పేటీఎం డిప్యూటీ జనరల్ మేనేజర్ సోనియా ధావన్ ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రూ. 500 - 1000 నోట్లు రద్దయినప్పటి నుంచి పేటీఎం చెల్లింపులకు భారీ డిమాండ్ ఏర్పడిందని.. మోడీ నిర్ణయం వెలువడిన కేవలం కొన్ని గంటల్లోనే ఇది సుమారు 435 శాతం పెరిగిందని - రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ తాజా నిర్ణయంతో దేశంలో ఆన్ లైన్ చెల్లింపుల ప్రక్రియకు వచ్చే రోజుల్లో మరింతగా డిమాండ్ పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన సోనియా ధావన్... దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని నియంత్రించేందుకు ప్రధాని నిర్ణయం బాగా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/