పేటీఎంతో పిచ్చెక్కిపోతుంది

Update: 2016-12-23 04:27 GMT
పెద్దనోట్ల రద్దు ముందు వరకూ కొంతమందికి మాత్రమే సుపరిచితమైన పేటీఎం.. ఇప్పుడు అన్నిచోట్లా కనిపించేస్తోంది. నగదు రహిత లావాదేవాల్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు చురుగ్గా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. పేటీఎం తరహా చెల్లింపు ప్రక్రియలపై పలువురు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. చిన్న చిన్న దుకాణాల్లోనూ పేటీఎం చెల్లింపులకు వీలు కల్పించేలా అవకాశం ఉంటుంది.

ఇదంతా బాగానే ఉన్నా.. పేటీఎం చెల్లింపుల్లో చోటు చేసుకుంటున్న సాంకేతికాంశాలు ఇప్పుడు వినియోగదారులకు పిచ్చెక్కించేలా చేస్తున్నాయి. తమ ఖాతాలతో నగదు డెబిట్ (చెల్లింపులు జరుగుతున్నా) అవుతున్నా.. పేటీఎం ఖాతాలో మాత్రం క్రెడిట్ (జమ కాకపోవటం) కాకపోవటంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ఈ సమస్య కాస్త తక్కువగా ఉన్నా.. నోట్ల రద్దు అనంతరం ఇది మరింతగా పెరిగింది. పేటీఎంను వినియోగించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. సాంకేతిక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. బ్యాంకు ఖాతా నుంచి పేటీఎం ఖాతాలకు జమ చేసిన మొత్తం కనిపించకపోవటంతో.. ఆ మొత్తం గురించి కస్టమర్ కేర్ సిబ్బంది దృష్టికి తీసుకెళుతున్నారు. అయితే.. వారీ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి. టెక్నాలజీ సమస్యలు.. సర్వర్ల అనుసంధానంతో ఇలాంటి సమస్యలు వస్తున్నట్లుగా పేటీఎం చెబుతున్నా..ఐఫోన్ల వినియోగదారులకు మాత్రం పేటీఎం చుక్కలు చూపిస్తోందని చెబుతున్నారు. మరీ.. సమస్యల్ని వీలైనంత త్వరగా తీరిస్తే మంచిది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News