వరంగల్ ఎన్నికల ప్రచారంలో ఇది పీసీసీ తరఫున సరికొత్త హుకుం. ఎన్నికలప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ నాయకులు గానీ, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు గానీ ఎవ్వరూ వీలైనంత వరకు రాజయ్య కుటుంబంలో జరిగిన ఘోరం గురించిమాట్లాడకుండా ఉంటే మంచిదని పీసీసీ పెద్దల తరఫున వారికి మౌఖికమైన ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు కాంగ్రెసు నాయకులు ఎవ్వరూ తమ ప్రచారంలోగానీ, తమ సంభాషణల్లో గానీ రాజయ్య కుటుంబంలో విషాదం ప్రస్తావనే లేకుండా జాగ్రత్త పడాలని, ఒకవేళ అనివార్యంగా ఆ టాపిక్ వచ్చేస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజయ్య మీద సానుభూతి వ్యక్తమయ్యేలా మాత్రం మాట్లాడవద్దని పీసీసీ పెద్దలు వారికి మార్గదర్శనం చేసేశారుట.
రాజయ్యమీద సానుభూతి చూపేలా ఒక్క మాట మాట్లాడినా కూడా.. అది పార్టీకి వంద ఓట్ల చేటు చేస్తుందనే భయం ఇప్పుడు కాంగ్రెసులో కలుగుతోంది.
రాజయ్య కుటుంబమే సారికను, ముగ్గురు చిన్నారులను అత్యంత దారుణంగా హతమార్చారని పోలీసులు కూడా ఒక నిర్ధరణకు వచ్చేసిన ఈ తరుణంలో ఆ కుటుంబం మీద ప్రజల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఇంటికోడలిని, మనుమలను ఏడాదిగా అనాథగా వదిలేసి వారి పోషణ గురించికూడా పట్టించుకోకుండా ఉన్న రాజయ్య కుటుంబం మీద స్థానికుల్లో ద్వేషంఉంది. తనతంటాలు తాను పడుతూ పిల్లల్ని పెంచుకుంటున్న సారిక మీద స్థానికుల్లో ఎంత సానుభూతి ఉన్నదో నిన్న టీవీ ఛానెళ్లలో వ్యక్తమైంది. వారంతా రాజయ్య మీద తీవ్రంగా నిప్పులు చెరిగారు. కోడలిని దారుణంగా వేధించినందుకు గృహహింస కేసు నడుస్తున్న రాజయ్య కు టిక్కెట్ ఇవ్వడాన్నే పలువురు తప్పుపట్టారు.
ఈ నేపథ్యంలో.. కాంగ్రెసు కు ఇప్పటికే సగం దెబ్బ పడిపోయిదని..దానికి తగినట్లు రాజయ్య మీద సానుభూతి వ్యక్తమయ్యేలా.. నాయకులు ఎవరైనా ఎక్కడ మాట్లాడినా..అది ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెసు పడే ఓట్లను కూడా దూరంచేస్తుందని ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారుట. పాపం.. రాజయ్య కాలం కలిసి రానప్పుడు సొంత పార్టీ వారు కూడా చీదరించుకోవడం అంటే ఇదే మరి.