నారా లోకేష్ మంచి వార్తలతో కంటే నెగెటివ్ వార్తలతోనే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. సమకాలీన అంశాలపై అవగాహన లేమితో పదే పదే మాట తడబడి మీడియాకు దొరికిపోతుంటాడతను. ముఖ్యంగా సోషల్ మీడియాలో అతడి గురించి జరిగే నెగెటివ్ ప్రచారం అంతా ఇంతా కాదు. వివిధ అంశాలపై అవగాహన రాహిత్యానికి తోడు భాష విషయంలో నైపుణ్యం లేకపోవడం వల్ల కూడా నారా లోకేష్ తరచుగా బుక్కవుతుంటాడు. ఈ విషయంలో సరదిద్దుకోవడం కోసం అతను ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు ట్యూటర్ గా వ్యవహరించిన ప్రముఖ రచయిత.. రీసెర్చ్ స్కాలర్ పెద్ది రామారావును ట్యూటర్ గా నియమించుకున్నట్లు సమాచారం.
స్వతహాగానే తెలుగు భాషపై మంచి పట్టు.. వాక్చాతుర్యం ఉన్న ఎన్టీఆర్.. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి ముందు పెద్ది రామారావు దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. అది అతడికి బాగా ఉపయోగపడింది. ఎన్నికల ఫలితాల సంగతలా ఉంచితే ఎన్టీఆర్ ప్రసంగాలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో లోకేష్ కూడా ఎన్టీఆర్ బాటలోనే నడవాలనుకుంటున్నాడు. మొత్తానికి ఈ నిర్ణయం ద్వారా తాను జూనియర్ ఎన్టీఆర్ లాగా మాట్లాడలేనని.. అతడి స్థాయికి ఎదగడానికి కష్టపడాల్సి ఉందని లోకేష్ అంగీకరించినట్లు అయింది. ఇంత కాలానికి అతడికి వాస్తవం బోదపడటం మంచిదే కానీ.. ఈ పాఠాలతో అతడిలో ఏమాత్రం మార్పు వస్తుందో చూడాలి. పెద్ది రామారావు పాఠాలు ఎన్టీఆర్ కు అదనపు బలం అయ్యాయే తప్ప.. ఆయనేమీ సున్నా నుంచి ఎన్టీఆర్ ను మార్చలేదు. అతను స్వతహాగా ఏక సంతాగ్రాహి. గొప్ప వాక్చాతుర్యం.. భాష ఉన్నాయి. కానీ లోకేష్ పరిస్థితేంటో తెలిసిందే. మరి పెద్ది రామారావు పాఠాలు మాత్రం అతడిలో ఏమాత్రం మార్పు తెస్తాయన్నదే సందేహం.