వైకాపా ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే నటి రోజాపై మంత్రి పీతల సుజాత ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయారు. రోజాకు కళ్లు కనబడడం లేదా అని కామెంట్లతో కుమ్మేశారు. ఇంతకీ మంత్రిగారికి అంత కోపం ఎందుకొచ్చిందంటే.. అంతకుముందు సీఎం చంద్రబాబు మీద రోజా తన స్టైల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కరవులో అల్లాడుతుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు విహారయాత్రల నిమిత్తం గోవాకు వెళ్లారని రోజా విరుచుకుపడ్డారు. బాధ్యతలేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబేనని చెప్పారు. సీఎం ఇంత బాధ్యతా రహితంగా ఉంటే.. ఎలా అని కూడా రోజా ప్రశ్నించారు. మరి రోజా వ్యాఖ్యలు ఇంత షార్ప్ గా ఉంటే టీడీపీ వాళ్లు ఊరుకుంటారా? వాళ్లు కూడా రోజాపై అంతే షార్ఫ్‌గా రెచ్చిపోయారు.
మంగళవారం మంత్రి పీతల సుజాత విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రోజా కళ్లుమూసుకున్నట్టుంది అని అనేశారు. అంతటితో ఆగకుండా సీఎం చంద్రబాబు అహర్నిశలూ కష్టపడుతున్నారని చెప్పారు. కరవులో ఉన్న రైతులను సీఎం చంద్రబాబు ఆదుకున్నప్పుడు ఈ విమర్శలు చేస్తున్న రోజా ఎక్కడుందని ప్రశ్నించారు మంత్రి. సీఎం సహా మంత్రులు అనంతపురంలో మూడు రోజులు క్యాంప్ వేసి మరీ అక్కడి వేరు శనగ రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, ఈ విషయం రోజాకు కనిపించలేదా? అని ఘాటుగా ఏకేశారు. రోజా విమర్శలు చూస్తుంటే, ఆమె కళ్లు మూసుకుపోయినట్టు ఉన్నాయని పీతల ఎద్దేవా చేశారు.
విపక్షంలో ఉన్నాం కదా అని ఏదిబడితే అది మాట్లాడితే.. చెల్లదని మంత్రి హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి రైతులకు ఏ కష్టం వచ్చినా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పంటల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అవసరమైతే అనంతపురం రైతులను ఆదుకునేందుకు మరోసారి పంట తడులను అందిస్తామని మంత్రి చెప్పారు. ఏదేమైనా.. రోజాకు మంత్రి సుజాత ఘాటుగానే రిప్లే ఇచ్చారు.