పురుషాంగం సైజ్ తగ్గుతోంది.. మానవ పునరుత్పత్తి భవిష్యత్తులో కష్టమేనా?

Update: 2022-06-17 05:30 GMT
ప్రపంచ జనాభా రాను రాను తగ్గిపోతుందా..? మనుషులు జనన రేటు తగ్గుతుందా..? అందుకు కాలుష్యమే కారణమా..? కాలుష్యంతో ఇన్నాళ్లు కేవలం ఆరోగ్య సమస్యలే వస్తాయని తెలుసు. కానీ ఇప్పుడు సంతానోత్పత్తి తగ్గుతోందట. ఇదేదో విశ్లేషకులు అంటున్న మాట కాదు. వైద్య పరిశోధనలో తేలుతున్న నిజం. డాక్టర్ స్వాన్ చేసిన పరిశోధనలో భయంకర నిజాలు బయటపడ్డాయి. ఈ పరిశోధన వివరాలను ఆయన 'కౌంట్ డౌన్' అనే పుస్తకంలో వివరించారు. 'పారిశ్రామిక రసాయనాలు, పురుషాంగం పొడవు' అనే అంవంపై చర్చించారు.

డాక్టర్ స్వాన్ టీం మొదట్లో ఎలుకలపై ఈ ప్రయోగాలను చేశారు. ఎలుకల్లోని థాలెట్ సిండ్రోమ్ ను పరిశీలించారు. 2000 సంత్సరంలో మానవుల్లో తక్కువ మోతాదులో ఉన్న థాలెట్స ను కొలవడం ద్వారా పరిశోధన చేయడం సాధ్యమైంది. ఆ తరువాత తల్లిదండ్రులు, వారి సంతానం మధ్య ఏ విధంగా ప్రవర్తిస్తాయి. .? స్త్రీ లైంగిక కోరికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి..? అనే అంశాలపై పరిశోధనలు చేశారు. ఫైనల్ గా 2017లో స్పెర్ప్ కౌంట్, కాలుష్యం మధ్య ఎలాంటి సంబంధం ఉందనే విషయాన్ని పరిశీలించింది. దాదాపు 45 వేల మంది ఆరోగ్యంగా ఉన్న పురుషులపై అధ్యయనం చేశారు. వీరిలో 185 అధ్యయనాలు స్టడీ చేసిన తరువాత 1973 నుంచి 2011 మధ్య 59 శాతం స్పెర్మ్ కౌంట్ తగ్గిందని గుర్తించారు.

ఆయన తెలిపిన పరిశోధనల ప్రకారం.. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ ప్రభావం సంతానోత్పత్తితో పడుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న 20 ఏళ్ల యువకులపై, అమ్మాయిలపై కాలుష్య కారకంతో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నారు. ఇప్పుడున్న 80 ఏళ్ల ముసలాళ్లకు ఉన్న ప్రొడక్టివిటీ.. 20 ఏళ్లు ఉన్న అమ్మాయల్లో లేకపోవడం గమనార్హం. దీతో అంగస్తంభన, ఇన్ ఫెర్టిలిటీ, చిన్న పురుషాంగం తో జన్మించే శిశువుల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. వాతావరణంలో ఏర్పడిన కాలుష్యంతో ఆనారోగ్య జీవన శైలి.. హార్మోన్ల సమతుల్యకు భంగం కలిగిస్తున్నాయంటున్నారు. దీంతో పునరుత్పత్తి విధ్వంసం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే రసాయనాల కారణంగా పునరుత్పత్తి సమస్యలు విపరీతంగా తలెత్తుతున్నాయి. ఈ కెమెకల్స్ తో హార్మోన్ ఎండోక్రైన్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. ఎండోక్రైన్ సిస్టమ్ ఫంక్షన్ లో ఒకటైన 'సెక్సువల్ ఫంక్షన్ అండ్ రీ ప్రొడక్షన్'పై ఎఫెక్ట్ ఉంటుంది. ఒక వస్తువు లేదా పదార్థం ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి థాలెట్స్ సాయపడుతాయి. ప్రస్తుతం టాయ్స్, ఫుడ్ ప్యాకేజింగ్, డిటర్జెంట్స్, సౌందర్య సాధనాలు సహా మరెన్నో ఉత్పత్తుల్లో వీటిని వాడుతున్నారు. ఈ పదార్థాలు రాను రాను తీవ్ర హానిని కలిగిస్తాయని అంటున్నారు.
Tags:    

Similar News