వ్యాక్సిన్ తీసుకుంటేనే రేషన్, పెన్షన్ ...లేకపోతే కట్ !

Update: 2021-10-26 07:42 GMT
క‌రోనా వైర‌స్ మహమ్మారి నియంత్ర‌ణ‌కు వ్యాక్సినేష‌న్‌ ను మ‌రింత ముమ్మ‌రం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ యంత్రాంగం క‌ఠిన నిర్ణ‌యాల‌ను అమ‌లు చేసేందుకు సిద్ధం అవుతోంది. కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకోనివారికి రేష‌న్‌, పెన్ష‌న్ క‌ట్ చేస్తామ‌ని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు వెల్ల‌డించారు. రేష‌న్ తీసుకోవాలంటే బీపీఎల్ దిగువ‌న ఉన్న కుటుంబాలతో పాటు అంత్యోద‌య కార్డుదారులు విధిగా క‌రోనా వ్యాక్సిన్ వేయించుకోవాల‌నే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు.

వ్యాక్సిన్ తీసుకోనివారికి పింఛ‌న్ రాద‌ని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వంద కోట్లకు చేరింది. తెలంగాణలో కూడా రెండు కోట్ల డోసులుకు దగ్గరగా ఉంది. కానీ, 60లక్షలకు పైగా ప్రజలు ఒక్క డోసు కూడా వేయించుకోలదేని, వారికోసం కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నట్లు చెప్పారు శ్రీనివాసరావు. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం నమోదువుతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల్లో దాదాపుగా అందరూ ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోనివారే ఉన్నారని శ్రీనివాసరావు వివరించారు. వ్యాక్సిన్ తీసుకోని వారికే వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మూడో వేవ్ రాకుండా ఉండాలంటే, వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని అన్నారు.

వ్యాక్సిన్ తీసుకోనివారికి రేషన్, పెన్షన్‌ ను నిలిపి వేస్తామంటూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచలన ప్రకటన చేసింది. ఈ నిబంధన నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకుని, రెండో డోస్ వేసుకోనివారు సుమారు 35 లక్షల మంది ఉన్నారు. డోస్ తీసుకోవాల్సిన డేట్ దాటిపోయినా కూడా వారు వ్యాక్సిన్ తీసుకోవట్లేదు. ఈ విషయంపై అధికారులు పదేపదే వివరిస్తూ వచ్చినా కూడా జనాలు పట్టించుకోకపోవడంతో కఠిన చర్యలకు సిద్దమయ్యారు. ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ వేసుకోకపోతే రేషన్, పెన్షన్ కట్ అవుతుందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గలేదని, దానిని నివారించేందుకు వ్యాక్సినేషన్ ముఖ్యమని ఆయన తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
Tags:    

Similar News