కరోనా వచ్చి వెళుతోందా? ఏడు నెలల తర్వాత అసలు ఎఫెక్ట్

Update: 2020-10-16 02:30 GMT
కరోనా ఇప్పటికే చాలా మందికి సోకింది. వెళ్లిపోయింది. అయితే కొందరికి లక్షణాలు బయటపడి ఆస్పత్రి పాలు కాగా.. చాలా మంది యువత, రోగనిరోధక శక్తి ఉన్న వారికి అసలు వచ్చి పోయింది కూడా తెలియడం లేదట...

అయితే కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు ఆ వ్యాధి సోకిన ఏడు నెలల తర్వాత అసలు రోగం బయటపడుతోందట.. దీన్నే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అని వైద్యులు అంటున్నారు.

తాజాగా పోస్ట్ కోవిడ్ లక్షణాలతో అమెరికా, బ్రిటన్ లతోపాటు ఇండియాలోనూ మళ్లీ ఆస్పత్రుల్లో చేరుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. వీరి సంఖ్య లక్షల్లోనే ఉంది.

పోస్ట్ కోవిడ్ రోగాలకు వైద్యనిపుణులు ‘లాంగ్ కోవిడ్’గా పేర్కొన్నారు. నిజానికి నాలుగు రకాల రోగలక్షణాలు.. ఊపిరి అందకపోవడం.. దీర్ఘకాలం అలసట.. బ్రెయిన్ ఫాగ్.. మానసిక ఒత్తిడి ఇంకొంతమందికి కొన్ని అవయవాలు సరిచేయలేనంతగా దెబ్బతింటున్నాయి. సో లాంగ్ టర్మ్ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని.. అశ్రద్ధ చేయవద్దని సూచిస్తున్నారు.

కరోనాను జయించామని అనుకుంటే కొన్ని నెలల తర్వాత కొత్తగా మరికొన్ని రోగాలు వస్తున్నాయని తాజాగా పరిశోధనలో తేలింది. ఈ రోగలక్షణాలన్నీ ఒకదానిమీద మరొకటి ఆధారపడతాయని తేలింది. అందుకే దీన్ని లాంగ్ కోవిడ్ అంటున్నారు. దీనిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Tags:    

Similar News