ఒకరిని అభిమానించటం.. ఆరాధించటం మామూలే. కాకుంటే.. తాము అభిమానించే వారిలోని తప్పుల్ని పట్టించుకోకుండా చూపించే ప్రేమ వారి వరకు నష్టం కలగదేమో కానీ.. మిగిలిన వారికి ఇబ్బందులకు గురి చేస్తుంది. తప్పు చేస్తే తప్పు.. ఒప్పు చేస్తే ఒప్పు అన్నట్లుగా ఉండటం.. చేయాల్సింది చేయకుంటే ఎవరినైనా సరే నిలదీసే లక్షణం ఉంటే.. మెరుగైన సమాజానికి అవకాశం ఉంటుంది. ప్రధాని మోడీనే తీసుకోండి. ఆయన్ను ఎంతోమంది అభిమానిస్తారు. అంతకు మించి ఆరాధిస్తారు.
అయితే.. ఈ తీరు మోతాదుకు మించిందిగా ఉండకూడదు. చేసే తప్పుల్ని ఎత్తి చూపేందుకు ధైర్యం సరిపోక.. అన్ని ఒప్పులే.. తప్పులేమీ లేవన్నట్లుగా వ్యవహరించటంతోనే అసలు సమస్య. కోవిడ్ సెకండ్ వేవ్ వేళ.. ఇప్పుడు వేళ్లన్ని మోడీ సర్కారు వైపే చూపుతున్నాయి. దాన్ని తప్పు పట్టే వాదనను మోడీ క్యాంప్ మొదలు పెట్టింది. వారు ఉన్నదే తిమ్మినిబమ్మిని చేయటం.. బమ్మిని తిమ్మిని చేయటం కోసమే అన్నది మర్చిపోకూడదు.
అలా అని.. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేయటం సరికాదు. మోడీ సర్కారు విషయంలోనూ అది వర్తిస్తుంది. కరోనా మొదటి దశలో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటంలో మోడీ సర్కారు ప్రదర్శించిన ముందుచూపుపై పొగిడేవారు ఉన్నట్లే విమర్శించే వారు ఉన్నారు. కానీ.. రెండో దశను ఎదుర్కొనే విషయంలో.. కేంద్రం అనుసరించిన వైఖరి ఏ మాత్రం సరిగా లేదని చెప్పాలి. ఈ వాదన ఎంత నిజమన్న విషయాన్ని కొన్ని గణాంకాలు అసలు విషయాల్ని చెప్పేస్తున్నాయి. కరోనా వేళ.. ఎవరైనా ఆక్సిజన్ ప్లాంట్ లు పెట్టుకోవటానికి ముందుకు వస్తే.. అనుమతి ఇస్తామని కేంద్రం చెప్పింది.
విన్నంతనే చిలక పలుకులుగా ఉన్న ఈ మాటల్లో నిజం ఎంతన్న విషయాన్ని.. ఆక్సిజన్ ప్లాంట్ కోసం పెట్టిన అప్లికేషన్లలో ఎన్నింటికి క్లియరెన్సు ఇచ్చారన్న విషయాన్ని చూసినప్పుడు అసలు విషయం అర్థం కావటమే కాదు.. మోడీ సర్కారు లోని డొల్లతనం ఇట్టే బయటపడుతుంది. గత ఏడాది అక్టోబరు నాలికి 163 కొత్త ఆక్సిజన్ ప్లాంట్ల కోసం అప్లికేషన్లు పెడితే.. ఎనిమిది తొమ్మిది నెలల తర్వాత అంటే.. రెండురోజుల క్రితం వరకు లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే.. మోడీ సర్కారు ఓకే చెప్పిన ఆక్సిజన్ ప్లాంట్లు ఎన్నో తెలుసా? అక్షరాల 33 మాత్రమే. అంటే.. 130 అప్లికేషన్లకు ఆమోద ముద్ర పడలేదు.
కరోనా మహమ్మారి విరుచుకుపడి.. వివిధ దేశాల్లో ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్న వైనాన్ని చూసిన తర్వాత అయినా మేల్కొని ఉంటే సరిపోయేది. ఇదంతా ఎందుకు.. ప్రతి ఆసుపత్రికి తప్పనిసరిగా ఆక్సిజన్ ప్లాంట్ ఉండాల్సిందే అన్న నిబంధనను పెట్టి ఉంటే.. ఇప్పడున్నంత ఘోరమైన పరిస్థితి ఎదురయ్యేదే కాదు. దరిద్రం కాకపోతే.. ప్రాణవాయువు అందక మనుషులు చచ్చిపోవటం ఏమిటి? అది కూడా డిజిటల్ యుగంలో? లోపం ఎక్కడ ఉంది? దేశం కోసమే సెలవు తీసుకోకుండా పని చేసే మోడీ హయాంలో ఇలాంటి తప్పు ఎందుకు జరిగింది? అందుకు బాధ్యులు ఎవరు? అన్నది అసలు ప్రశ్న. అభిమానించటం తప్పు కాదు.. నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికి అభిమానించటం నేరమే అవుతుంది.