తమిళనాడు ముఖ్యమంత్రి , డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తాజాగా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత డీఎంకే ఇతర ఏ పార్టీ తో పొత్తు లేకుండానే సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లను గెలిచింది. దీనితో ఎన్నో ఏళ్ల కళను నిజం చేసుకుంటూ స్టాలిన్ సీఎం కుర్చీని అధిరోహించారు. ఇదిలా ఉంటే ..సీఎం ఎం.కె.స్టాలిన్ మూలాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఆయన పూర్వీకులు ఒంగోలు నగర పరిధిలోని పెళ్లూరులోని వెంకటగిరి రాజుల ఆస్థాన పరిధిలోని దేవాలయాలకు ఆస్థాన విద్యాంసులుగా పని చేస్తుండేవారట.
ఈ క్రమంలోనే వారికి అక్కడికి అతి సమీపంలోని ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో 150 ఎకరాల భూమిని, పెళ్లూరు చెరువు కింద 20 ఎకరాల మాగాణి భూమిని, చెరువుకొమ్ముపాలెంలో నివాసం ఉండేందుకు భూమిని ఇచ్చినట్లుగా ఆ గ్రామస్తులు చెప్తున్నారు. వెంకటగిరి రాజుల వారసులు ఇప్పటికీ ఈ గ్రామంలో ఉన్నారు. వారు మాత్రం డీఎంకే అధినేత, దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి తాతల కాలంలోనే పంటలు పండక కరువు కాటకా వల్ల చెన్నపట్నంకు వలస వెళ్ళినట్లు తమ పూర్వీకులు చెబుతుండేవారని చెప్తుంటారు. అయితే అలా వెళ్ళిన కరుణానిధి చివరకు సీఎంగా ఒక వెలుగు వెలగడం తమ గ్రామానికి గొప్పతనంగా వారు చెబుతుంటారు. భూములు ఇప్పటికీ ఉన్నా వారు ఎప్పుడు కూడా వచ్చిన దాఖలాలు లేవని చెబుతూ కరుణానిధి కుమారుడు మళ్లీ స్టాలిన్ సీఎం కావడం తమకు గర్వంగా ఉందని చెప్తున్నారు. కరుణానిధి ఏలూరులో జరిగిన ఒక సాహిత్య సభలో ఈ అంశాన్ని ప్రస్తావించాడని, ఒంగోలులో జరిగే సాహిత్య సభకు కూడా త్వరలోనే వస్తానని చెప్పారని, స్టాలిన్ ను కూడా ఒకసారి జిల్లాకు రావాలని కోరడం జరిగిందని, అయితే ఆయన రాలేకపోయారంటూ నాయీ బ్రాహ్మణులు చెప్తున్నారు. ఏదేమైనా తెలుగువాడు, అందులోను మన ఒంగోలు వాసి తమిళనాట మరో సీఎం కావడం జిల్లావాసులకు , అలాగే రాష్ట్ర వాసులకి కూడా గర్వ కారణం.