లాక్ డౌన్ లో ప్రజలు వినోదం కోసం వెతుకుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఓటీటీలో వచ్చే సినిమాలు , వెబ్ సిరీస్‌లు, టీవీల్లో ప్రోగ్రాములు ప్రజలకు కావాల్సినంత ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. ఇదే సమయంలో ప్రజలు ప్రతి చిన్న , ముఖ్యమైన విషయంపై దృష్టి పెడుతున్నారు. తాజాగా అలా ప్రజల దృష్టిలో పడి హాస్యం అందించింది తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అని అంటున్నారు. ఎందుకంటే ఏకంగా ప్రధాని మోడీ గురించే ఆసక్తికర కామెంట్ చేశారయన. అయితే, అది లాజిక్ కు అందకపోవడం అసలు ట్విస్ట్.
ప్రస్తుతం ఆన్‌లైన్ విధానంలో టీడీపీ పార్టీ పండుగ అయిన మహానాడు జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ గురించి ప్రస్తావన, ఆయన్ను స్మరించుకోవడం మహానాడులో ఆనవాయితి. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నుంచి మొదలుకొని కార్యక్రమంలో ప్రసంగించే నాయకుడి వరకూ అంతా ఈ మేరకు తమ నేతను గుర్తు చేసుకుంటారు. అలా గుర్తు చేసుకున్న క్రమంలో అచ్చెన్నాయుడు కీలక కామెంట్లు చేశారు. విశాఖ బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..సినీ రంగం ద్వారా ఎన్టీఆర్ తెలుగు జాతికి మంచి పేరు తెచ్చారని..రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తెచ్చారని పేర్కొన్నారు.
అయితే, అచ్చెన్నాయుడు ఇక్కడితోనే ఆపివేయకుండా బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని వెల్లడించారు. సంక్షేమం అంటే ఆనాడు ఎన్టీఆర్ పెట్టిన పథకాలు అని కీర్తించారు. మోడీ ప్రధాని అయ్యాడు అంటే కారణం ఎన్టీఆర్ అని అచ్చెన్నాయుడు ఆశ్చర్యకర కామెంట్లు చేశారు. అయితే, ఎందుకు కారణం, ఎలా కారణం అనే దానికి అచ్చెన్న వివరించలేదు కానీ..ఎక్కడో మోడీ మన ఎన్టీఆర్‌కు మాత్రం భలే లింక్ పెట్టేశారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.