కరెంట్ బిల్లులకు భయపడుతున్న జనాలు

Update: 2020-06-06 14:30 GMT
విద్యుత్ బిల్లులు జనాలను భయపెడుతున్నాయి. హైదరాబాద్ లో కరోనా కంటే కరెంట్ బిల్లులను చూసే ఇప్పుడు జనాలు వణికిపోతున్నారు. ఈ లాక్ డౌన్ వేళ కరెంట్ వాడినా వాడకపోయినా నెలనెలా బిల్లు పెరుగుతూ రావడం చూసి జనాలు బెంబేలెత్తిపోతున్నారు.

లాక్ డౌన్ వల్ల మూడునెలలుగా అందరికీ ఉపాధి పోయింది. పైసా ఆదాయం లేక ఇళ్లు గడవడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో భారీగా పెరిగిన ఈ బిల్లులను చూసి ఎలా చెల్లించాలో తెలియక అయోమయ పరిస్తితిలో జనాలు పడిపోయారు.

చాలా మంది వాడుకున్న విద్యుత్ కంటే ఎక్కువగా చార్జీలు వస్తుండడంతో మొత్తుకుంటున్నారు. చిన్న ఇంటికి కూడా వేలల్లో విద్యుత్ బిల్లులు షాకిస్తున్నాయి. వాడకం కంటే ఎక్కువగా విద్యుత్ బిల్లులు రావడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారు. అయితే విద్యుత్ వినియోగం బట్టే బిల్లులు వసూలు చేస్తున్నామని అధికారులు అంటున్నారు.

లాక్ డౌన్ కారణంగా మీటర్ రీడింగ్ ను విద్యుత్ సిబ్బంది లెక్కించడం లేదు. ఏప్రిల్, మేలో ఇలాగే చెల్లించారు. గత ఏడాది ఇదే నెలలో ఎంత బిల్లు వచ్చిందో అంతే మొత్తాన్ని ప్రొవిజినల్ బిల్లుగా చెల్లించారు. అయితే ఈ బిల్లులు వేలల్లో వస్తుండడంతో లబిదిబోమంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారం తప్పించాలని వారు కోరుతున్నారు.
Tags:    

Similar News