కరోనా వేళ ఈ టాబ్లెట్ ను తెగ వాడేసిన జనం

Update: 2022-01-21 04:30 GMT
కరోనా కల్లోలంలో ఇప్పుడు అందరూ ఆరోగ్య రక్షణకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కోవిడ్19 మహమ్మారి మళ్లీ విస్తృతంగా వ్యాపిస్తోంది. దేశంలో థర్డ్ వేవ్ దిశగా సాగుతోంది.  దేశంలో కేసులు రోజుకు 3 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఇక ఏపీలో ఏకంగా రోజుకు 12వేల వరకూ నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ 4వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి.

ఈ క్రమంలోనే కరోనా కల్లోలంలో అన్ని రంగాలు కుదేలైనా కూడా హెల్త్ కేర్, ఫార్మా రంగాలు మాత్రం కోట్లు సంపాదించాయి. కొన్ని కంపెనీలను అయితే బిలియనీర్లు గా మార్చేసింది.

ప్రధానంగా జ్వరానికి వాడే ‘డోలో ’ టాబ్లెట్ ను జనాలు ఎక్కువగా కొన్నారు.  దీనికోసం ఎగబడ్డారనే చెప్పాలి. మార్చి 2020లో కోవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుంచి  కోట్లకు పైగా మాత్రలు విక్రయించి రికా్డ్ బద్దలు కొట్టింది.

హెల్త్ కేర్ రీసెర్చ్ సంస్థ ‘ఐక్యూవీఐఏ’ డేటా ప్రకారం.. 2019లో కోవిడ్ వ్యాప్తికి ముందు బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ తయారు చేసిన పారాసిటమాల్ టాబ్లెట్ డోలో రతదేశంలో దాదాపు  7.5 కోట్ల స్ట్రిప్ లను విక్రయించి సంచలనం సృష్టించింది.

డేటా ప్రకారం.. ప్రస్తుతం కోవిడ్19 రోగులకు అత్యధికంగా సూచించిబడిన జ్వరం ఔషధంగా ఉన్న డోలో 2021లో రూ.307 కోట్ల టర్నోవర్ ను నమోదు చేసింది.

జీఎస్కే ఫార్మాస్యూటికల్స్ తన ఉత్పత్తి అయిన కాల్ పాల్ రూ.310 కోట్ల టర్నోవర్ ను సాధించింది. ఇక క్రోసిన్ గత ఏడాది రూ.23.6 కోట్లకు రెండంకెల విక్రయాలను నమోదు చేసింది. మొత్తంగా కోవిడ్ వేళ డోలో650 టాబ్లెట్ రికార్డు విక్రయాలను సాధించిందనే చెప్పాలి.
Tags:    

Similar News