జగన్ కు వీరభక్తుడట ఆయన..

Update: 2016-03-25 07:35 GMT
కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి టీడీపీకి వలసలు విపరీతంగా ఉన్న నేపథ్యంల నాని పేరు కూడా ఆ లిస్టులో వినిపిస్తోంది. కొద్దిరోజులుగా ఆయన పేరు టీడీపీలో చేరుతారంటూ ప్రచారమవుతోంది. దీంతో ఆయన విలేకరుల సమావేశం పెట్టి ఆ ప్రచారాన్ని ఖండించారు. ఈ సందర్భంగా నాని చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. విషం తీసుకుని చస్తాను కానీ టీడీపీలో మాత్రం చేరను అని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు వైఎస్ కుటుంబానికి అండగా ఉంటానని ఆయన చెప్పారు.

గత ఎన్నికల ముందు నాని కాంగ్రెస్ విప్ పదవికి రాజీనామా చేసి నేరుగా జగన్ ఇంటికి వెళ్లి అక్కడ వైసీపీలో చేరారు. వైఎస్ పై - జగన్ పై ఉన్న అభిమానంతోనే అప్పట్లో తాను కేబినెట్ ర్యాంకు ఉన్న పదవిని వదిలేసి మరీ జగన్ వద్దకు వచ్చానని... అలాంటి తాను టీడీపీలో చేరుతానని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల నాలుకలు ఎటైనా తిరుగుతున్న తరుణంలో నాని మాటలు ఎంతవరకు నిజాలన్నది చూడాలి.
Tags:    

Similar News