జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై కౌంటర్లు ఇస్తే.. ఏపీ సర్కార్ నుంచి మంత్రులు ఎన్ కౌంటర్ చేసేశారు. ముఖ్యంగా మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పవన్ కళ్యాణ్ గాలి తీసేసేలా ఆయన చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ లెక్కలు, పత్రాలతో సహా మంత్రి పేర్ని నాని మీడియా సాక్షిగా ఎండగట్టిన వైనం ఇప్పుడు వైరల్ అవుతోంది.
తనపై కోపం సినీ ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని.. సినిమా టికెట్ల రేట్లను ఆన్ లైన్ చేసి హింసిస్తోందని పవన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు మంత్రి పేర్ని నాని గట్టి కౌంటర్లు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లపై గోల చేస్తున్నాడని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ‘అసలు నీ మీద ఇర్ష్య పడడానికి నీవేమైనా పోటుగాడివా? హిట్స్ ఇచ్చావా? అని ’ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.
2011లో గబ్బర్ సింగ్, 2012లో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’, 2013లో ‘అత్తారింటికి దారేది’?, 2015లో ‘గోపాల గోపాల’, 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2017లో కాటమరాయుడు, 2018లో అజ్ఞాతవాసి, 2021లో వకీల్ సాబ్’’ ఇందులో ఎన్ని హిట్స్ అయ్యాయి? భూమి బద్దలైపోయినవి ఎన్ని ఉన్నాయని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. నీకన్న బుడ్డ బుడ్డ హీరోలు.. అరటికెట్ గాళ్లు, కుర్రోళ్లు వాళ్లకు వచ్చిన కలెక్షన్లలో 60 పైసలు కూడా నీ సినిమాలకు రాదు అని విమర్శించారు.
నువ్వు డబ్బులు తీసుకుంటే మాకు ఏడుపు ఎందుకు అని మంత్రి పేర్ని నాని విమర్శించారు. నీకు ఖర్చులు ఉంటాయని.. భరణం చెల్లించాల్సినవి ఉన్నాయని.. చెల్లింపులు ఉన్నాయని.. దానికి మాకేం ఇబ్బంది అని విమర్శించారు. డ్యాన్సులు చేసి కాళ్లు విరగొట్టుకొని సంపాదించింది నువ్వేనని ఎద్దేవా చేశారు.
6.50 కోట్లు ఒక సినిమాకు పవన్ కళ్యాణ్ కు వస్తే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 100 కోట్లు వదులుకొని వచ్చానని ఎందుకు మాట్లాడావని మంత్రి పేర్ని నాని విమర్శించారు. సంవత్సరానికి 10 సినిమాలు చేస్తున్నావా? అని విమర్శించారు.
మొత్తం మంత్రి పేర్ని నాని లెక్కలు పత్రాలతో సహా పవన్ కళ్యాణ్ ను ఎండగట్టిన తీరు సంచలనమైంది.