గుజరాత్ లో నర్మదానది తీరాన నిర్మించిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ గత బుధవారం జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3000 కోట్లను ఖర్చు చేసింది. సర్దార్ సరోవర్ డ్యామ్ వద్ద నిర్మించిన ఈ విగ్రహాన్ని వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఉదయం 11.30 గంటలకు ప్రధాని ప్రారంభించారు. వాల్ ఆఫ్ యూనిటీ పేరిట ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రధాని ప్రారంభించి - ఉక్కుమనిషికి పుష్పాంజలి అర్పించారు. వెనువెంటనే వాయుసేనకు చెందిన రెండు ఎంఐ-17 విమానాలు గగనతలం నుంచి విగ్రహంపై పూలవర్షం కురిపించాయి. మూడు జాగ్వార్ యుద్ధ విమానాలు అతితక్కువ ఎత్తులో కలియదిరుగుతూ మువ్వన్నెల రంగులను వెదజల్లాయి. ఇలా తనదైన శైలిలో మోడీ రికార్డు సృష్టించగా...దానిపై విపక్షాలు విమర్శలు చేశాయి. ప్రధాన ప్రతి పక్షమైన కాంగ్రెస్ పార్టీతో సహా ఆయా పార్టీలు తమ అసంతృప్తిని వెళ్లగక్కాయి.
అయితే, తాజాగా ఈ జాబితాలో యూకే ఎంపీ చేరారు. యూకే ఎంపీ పీటర్ బోనె మాట్లాడుతూ యూకే రూ.11,000 కోట్లకు సమానమైన నిధులను ఫారిన్ ఎయిడ్ కింద భారత్ కు అందించిందన్నారు. అయితే, భారత్ మాత్రం రూ.3000 కోట్లను ఓ భారీ నిర్మాణం అందులోనూ ఓ `పూర్తి నాన్సెన్స్` అవసరం కోసం ఖర్చు చేసిందని మండిపడ్డారు. ఇది ప్రజలను పిచ్చి వైపు నడిపించే చర్య. భారతదేశంలో పెద్ద మొత్తంలో డబ్బులు విగ్రహాలపై ఖర్చు పెడుతున్నారు. ఇలాంటివి చూస్తుంటే...అసలు భారత్ కు నిధులు ఇవ్వాల్సిన అవసరం ఏముందనే సందేహం వస్తోంది`` అని వ్యాఖ్యానించారు. కాగా, 2012 నుంచి 2015 వరకు వివిధ సంవత్సరాల్లో యూకే రూ.11,000 కోట్ల గ్రాంట్ ను భారత్ కు అందించింది.
ఇదిలాఉండగా...సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహావిష్కరణను స్థానిక గిరిజనులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 31న ఈ విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఆ రోజు 72 గ్రామాల్లో వంట చేసుకోమని గిరిజన నేతలు తేల్చిచెప్పారు. ``పటేల్ విగ్రహాన్ని మా ప్రాంతంలో నిర్మించడం సంతోషమే. ఆయనపై మాకు కోపం లేదు. కాకపోతే నర్మదా ప్రాజెక్టు పేరుతో మా భూములు లాక్కున్నారు. పునరావాసం మరిచిపోయారు. దీనిని వ్యతిరేకిస్తూ విగ్రహావిష్కరణ రోజు దాదాపు 75వేల మంది గిరిజనులు ఆందోళనలో పాల్గొంటారు. ఆ రోజు నర్మదా జిల్లాలోని 72 గిరిజన గ్రామాల్లో సంతాప దినం పాటిస్తాం. ఎవరూ కూడా వంట చేసుకోరు`` అని గిరిజనలు చెప్పారు.