కన్నబిడ్డతో పెళ్లి అనుమతివ్వండని పిటీషన్

Update: 2021-04-14 10:30 GMT
అమెరికాలో ఓ దారుణమైన పిటీషన్ కోర్టులో దారుణమైంది. రోజురోజుకు సమాజంలో బంధాలకు ఉన్న విలువ లేకుండా పోతుందనడానికి ఈ పిటీషన్ ఉదాహరణగా నిలుస్తోంది.

సాధారణంగా మన కడుపున పుట్టిన బిడ్డను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అంతకంటే పాపం.. మరొకటి ఉండదు. కానీ అమెరికాలో కన్నుమిన్నూ కానని ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని ఏకంగా కోర్టులో పిటీషన్ వేశాడు.

న్యూయార్క్ లో ఈ విచిత్రమైన పిటీషన్ దాఖలైంది. వేసిన వ్యక్తి సమాజంలో తన పరువు పోతుందని.. తన పేరు, అడ్రస్ చెప్పలేనని కోర్టులో వివరాలు దాఖలు చేయలేదు.

తన బిడ్డను పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని కోరుతూ ఓ పేరంట్ మాన్ హట్టన్ ఫెడరల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఆశ్చర్యానికి గురయ్యింది.

ఈ పిటీషన్ వేసింది స్వయంగా ఓ తండ్రినా? లేక తల్లినా అన్నది పూర్తిగా తెలియదు. ఆ పిటీషన్ లో అడ్రస్, పేరు రాయలేదు. వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందా? బంధం కొనసాగుతుందా? అన్నది తెలుపలేదు.

అయితే ఇలాంటి చట్టాలు  తమ మానసిక హాని కలిగించేలా ఉన్నాయని.. తన బిడ్డకు ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నానని పిటీషన్ లో పేర్కొన్నాడు.  వీటిని రాజ్యాంగ విరుద్దమైన చట్టాలని నిరసించాడు.

అయితే ఈ పిటీషన్ ను ఆమోదిస్తే సమాజానికి పెను ముప్పు అని.. తప్పు సంకేతాలు అందించినట్టు అవుతుందని పలువురు కోర్టులో వ్యతిరేకత వ్యక్తం చేశారు. కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News