కరోనా వైరస్ ..కరోనా వైరస్ .. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తుంది. ఈ పేరు వింటేనే ప్రపంచం మొత్తం వణికిపోతోంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఆ తరువాత ఒక్కొక్క దేశానికీ వ్యాప్తి చెందుతూ ప్రపంచం మొత్తం వ్యాపించింది. దీనితో ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఈ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి , ఇప్పటికే 8 నెలలు దాటిపోయినా కూడా ఇప్పటికి సరైన వ్యాక్సిన్ అయితే రాలేదు. ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సరైన వ్యాక్సిన్ లేకపోవడం రోజురోజుకి వైరస్ వ్యాప్తి భారీగా పెరుగుతుంది.
ఇక కరోనా ట్రీట్మెంట్ పేరుతో హాస్పిటల్స్ కూడా లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇకపోతే , ప్రస్తుతం కరోనా భాదితులకు వాడే ఫావిపిరవిర్ మెడిసిన్ కి భారీగా డిమాండ్ ఉంది. కరోనా పై కొద్దిగా ప్రభావం చూపుతుండటంతో ఇప్పటికే చాలా కంపెనీలు పోటాపోటీగా తయారుచేసి మార్కెట్లో విడుదల చేసాయి. పలు సంస్థలు ఫావిపిరవిర్ మెడిసిన్ ధర వేలల్లో నిర్ణయించింది. ఫావిపిరవిర్ మరియు మరొక యాంటీ-వైరల్ మెడిసిన్ , రెమిడెసివిర్, భారతదేశంలో కరోనా వైరస్ చికిత్సకు ఎక్కువగా వినియోగిస్తున్న మెడిసిన్. దీనిని కరోనా కేసుల్లో అత్యవసర చికిత్స కోసం ఇప్పటికే వినియోగిస్తున్నారు.
అయితే , ఈ మెడిసిన్ కరోనా సరైన మెడిసిన్ కాకపోయినప్పటికీ కూడా ఈ డ్రగ్ ను తయారుచేయడానికి పలు సంస్థలు పోటీపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం .. ప్రస్తుతం కరోనా ట్రీట్మెంట్ కోసం ఎక్కువగా భాదితులు వాడేది ఈ ఫావిపిరవిర్. దీనితో దీన్ని క్యాష్ చేసుకోవడానికి రోజుకో సంస్థ ఈ ఫావిపిరవిర్ మెడిసిన్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాం అంటూ ప్రకటిస్తున్నాయి. ఫావిపిరవిర్ తయారీలో పోటీ పడే పలు సంస్థలు తమ ప్రోడక్ట్ ను మార్కెట్ లోకి త్వరగా తీసుకుపోవాలనే లక్ష్యంతో మేము సామాన్య ప్రజల సంక్షేమం కోసమే ఈ ఫావిపిరవిర్ తయారుచేస్తున్నాం..అందుకే మార్కెట్ లో అతి తక్కువ ధర కి ఈ డ్రగ్ మీకు దొరికేలా చేస్తున్నాం అంటూ ప్రకటిస్తున్నారు. దేశంలో ఇప్పుడు చాలా సంస్థలు ఈ ఫావిపిరవిర్ తయారీ లో బిజీగా ఉన్నాయి. దీనికి కారణం ప్రస్తుతం ఈ ఫావిపిరవిర్ డ్రగ్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటమే. ఏదేమైనా కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా పలు సంస్థలు క్యాష్ చేసుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాయి. మొత్తంగా ఎవరి పని వారిది అంటూ .. కరోనా కాలంలో కూడా కోట్ల కోసం వెంపర్లాడుతున్నారు. ఫేవిపిరవిర్‌ను అభివృద్ధి చేస్తున్న లేదా విక్రయించే ఇతర భారతీయ తయారీదారులలో గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు సిప్లా లిమిటెడ్, బ్రింటన్ ఫార్మాలు ఉన్నాయి .