షర్మిల సభలో షాకింగ్ ఉదంతం.. ముఖ్యనాయకురాలి ఫోన్ మి

Update: 2021-07-09 04:30 GMT
కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ఘనంగా లాంఛ్ కావటం తెలిసిందే. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేళ.. తెలంగాణలో తాను అనుకున్న రీతిలో పార్టీని ఏర్పాటు చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావటమే తమ పార్టీ లక్ష్యమని ఆమె స్పష్టం చేయటం తెలిసిందే. రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన భారీ సభలో ఆమె పార్టీ పేరును.. జెండాను అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా  పార్టీ అధినేత షర్మిల చేసిన ప్రసంగం.. పార్టీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని పొంగేలా చేసింది.

ఉత్సాహభరితంగా సాగిన ఈ సభకు పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు..నేతలు పాల్గొన్నారు. అదే సమయంలో దొంగలు తమ చేతి వాటానని ప్రదర్శించారు. సందట్లో సడేమియా అన్న రీతిలో కొందరు వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే.. సభకు హాజరైన పలువురి మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్లుగా చెబుతున్నారు. ఎవరి దాకానో ఎందుకు..పార్టీకి చెందిన ముఖ్యనేత సైతం తన ఫోన్ చోరీకి గురి అయినట్లుగా చెప్పి వాపోయారు.

షర్మిల పార్టీకి చెందిన ముఖ్యమహిళా నేత.. ఇందిరా శోభన్ తన మొబైల్ ఫోన్ మిస్ అయినట్లు పేర్కొన్నారు. సభలో ప్రసంగించిన ఆమె.. తన స్పీచ్ ను కంప్లీట్ చేసే సందర్భంలో ఆమె మాట్లాడుతూ.. తన సెల్ ఫోన్ చోరీకి గురైనట్లు చెప్పారు. తన ఫోన్లో కీలకమైన డేటా ఉందని.. అందుకే తన ఫోన్ ను తనకు తిరిగి ఇవ్వాలని ఆమె విన్నవించుకున్నారు. అంత ఓపెన్ గా విన్నవించుకున్నా.. ఆమె ఫోన్ మాత్రం దొరకలేదు. దీంతో.. ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యనేత ఫోనే పోతే.. సాదాసీదా నేతలు.. అభిమానుల మాటేమిటన్న ఆరా తీస్తే.. పలువురి ఫోన్లు కూడా పోయినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News