వినియోగదారులకు షాకిచ్చిన ఫోన్ పే.. కారణమిదే

Update: 2020-03-06 23:30 GMT
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ‘యెస్ బ్యాంకు’పై నెలరోజుల పాటు మారటోరియం విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). దీంతో కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. యస్ బ్యాంకు కస్టమర్లు నెలకు రూ.50వేలకు మించి డ్రా చేయడానికి వీల్లేకుండా నిషేధం విధించారు.

ఈ నిషేధం ప్రముఖ పేమెంట్స్ యాప్ ‘ఫోన్ పే’ పడింది. యెస్ బ్యాంకు తో ఫోన్ పో ఒప్పందం కుదుర్చుకుంది. డబ్బుల చెల్లింపును ఫోన్ పే యెస్ బ్యాంకు ద్వారానే చేస్తుంది. దీంతో గురువారం రాత్రి నుంచి ఫోన్ పే సర్వీసుల నుంచి డబ్బు లావాదేవీలు నిలిచి పోయాయి. సర్వీసులు తాత్కాలికంగా ఆటంకం కలిగినట్టు ప్రకటన చేసింది.. దీంతో ఫోన్ పే కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భాగస్వామ్య బ్యాంకు పై ఆర్బీఐ నిషేధం వల్ల ఈ సమస్య ఎదురైందని.. త్వరలోనే తిరిగి సేవలను పునరుద్దరిస్తామని ఫోన్ పే చీఫ్ ఎగ్జి క్యూటివ్ సమీర్ నిగమ్ ట్వీట్ చేశారు.
Tags:    

Similar News