కరోనా వైరస్ : వైరల్ అవుతున్న ఫోటోలు !

Update: 2020-03-19 16:30 GMT
కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా , ఆ తరువాత ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ఈ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. కరోనా వచ్చినట్టు ఏ మాత్రం అనుమానం వచ్చినా కూడా ప్రభుత్వాలు కరోనా అనుమానితుడిని క్వారంటైన్ చేస్తుంది. దీనికి చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరు అతీతులు కారు. మొన్న ఆ మధ్య క్వారెంటైన్‌ లో ఉంచిన ఓ చిన్నారి.. గ్లాస్ విండోలో నుంచి చూస్తూ తన తండ్రిని హగ్ కోరగా.. అతను కంటతడి పెట్టుకున్న వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌‌ గా మారిన సంగతి తెలిసిందే.

తాజాగా అలాంటి సంఘటనే మరొకటి అమెరికాలో జరిగింది. తనకి నిచ్చితార్థం అయ్యింది అని , ఆ ఆనందాన్ని తన తాతయ్య తో పంచుకోవాలని వచ్చిన ఒక అమ్మాయిని , కరోనా వైరస్ కారణంగా తాతయ్యతో మాట్లాడటానికి వీలులేదు అని తెలిపారు. దీనితో ఆ యువతి తన నిశ్చితార్థపు విషయాన్ని కిటికీ ద్వారా తన తాతతో పంచుకున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు బుధవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ..ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్‌ గా మారాయి.

పూర్తి వివరాలు చూస్తే ... అమెరికాలోని నర్సింగ్‌ విద్యార్థిని కార్లీ బోయ్డ్‌ అనే యువతికి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. నార్త్‌ కరోలినాలోని రీహాబిలిటేషన్‌ సెంటర్‌ లో నివసిస్తున్న ఆమె తాత షెల్టాన్‌ మహాలా తో ఈ విషయాన్ని కార్లీ చెప్పాలనుకుంది. అయితే, కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రీహాబిలిటేషన్‌ సెంటర్‌ నిర్వహకులు ఆయనను కలుసుకునేందుకు కార్లీని లోపలికి అనుమతించలేదు. దీంతో కార్లీ నేరుగా ఆ సెంటర్‌కు వెళ్లి తన తాత ఉండే గది వెనుకకు వెళ్లింది. అక్కడ ఉన్న అద్దం కిటికీ నుంచే తన నిశ్చితార్థపు ఉంగరం చూపిస్తూ భావోద్యేగానికి లోనయ్యింది. అలా కార్లీ అద్దంపై చేయి ఉంచగా.. ఆమె తాత కూడా చేతిని తాకుతున్నట్లుగా అద్దంపై చేయి ఉంచాడు. ఇక ఈ ఫొటోకు ఇప్పటి వరకూ 2 లక్షలకు పైగా లైక్‌లు రాగా వేలల్లో కామెంట్లు వచ్చాయి. ‘ఈ విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు’ , ‘ మీ మధ్య ఉన్న బంధాన్ని కరోనా ఆపలేదు ..అతి త్వరలో మీ ఇద్దరు మళ్లీ కలుసుకొని మాట్లాడుకోవాలని కోరుకుంటున్నట్టు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.


Tags:    

Similar News