బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ భారతీయులపై చేస్తున్న ట్వీట్స్ ని ఇంకా వదలలేదు. ఇతడిది మందులేని పిచ్చనుకోవాలా లేక మందుతాగిన కోతి వాలకం అనుకోవాలో తెలియని పరిస్థితి. రియో ఒలింపిక్స్ లో భారతదేశానికి రెండంటే రెండే పతకాలు వచ్చినా సంబరాలు ఎందుకు చేస్తున్నారంటూ మొదలుపెట్టిన ఈ బ్రిటీష్ జర్నలిస్టుకు.. భారతీయుల నుంచి రెండు చెంపళూ వాచేలా రీట్వీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బలకు వాచిన తన చెంపలకు వెన్న రాసుకున్నాడో ఏమో.. మళ్లీ మొదలుపెట్టాడు.
భారతీయ ట్విటర్ జనాలు తన విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.. నేను చేసిన గాయాలకు మందుపూసుకొంటున్నారా? అంటూ మరో ట్వీట్ పెట్టాడు. ఒక్క రోజులో తన ఫాలోయర్ల సంఖ్య 12 వేల వరకూ పెరిందిందని చెబుతూ.. "థ్యాంక్యూ ఇండియన్ ఫ్రెండ్స్" అని ఇంకో ట్వీట్ పెట్టాడు. ఒలింపిక్స్ లో ఇండియా ప్రదర్శన - అనంతరం చేసుకుంటున్న సంభరాల మీద ఇతడు చేసిన ట్వీట్లపై సెహ్వాగ్ లాంటి వాళ్లు ఘాటుగా స్పందించినా.. క్రికెట్ పుట్టిన దేశమని చెప్పుకునే ఇంగ్లండ్ ఎందుకు ప్రపంచకప్ నెగ్గలేకపోయిందని అంటూ గట్టిగా వాయించినా కాసేపు మౌనంగా ఉండి మళ్లీ రెచ్చిపోయాడు.
ఇకపై ఇతని ట్వీట్లను "కుక్క మొరిగిందని" భావించి వదిలేస్తేనే బెటరేమో.. లేకపోతే ఇలాంటి అనామకుడికి - అజ్ఞానికి - జర్నలిస్టుని అని చెప్పుకుంటూ తిరిగే మతిభ్రమించినవాడికి అనవసరమైన పబ్లిసిటీ ఇచ్చి తప్పుచేశామనే బాద మిగులుతుంది!