మాటలతో టెన్షన్ పుట్టించటమే కాదు.. వామ్మో.. ఈ పైలెట్ మాకు వద్దు బాబోయ్ అనేలా చేసిందో లేడీ పైలెట్. ఆమె మాటలు.. వ్యవహారశైలితో విమాన ప్రయాణికులకు టెన్షన్ పుట్టించటమే కాదు.. ఆమెను మార్చకపోతే ఊరుకునేది లేదంటూ ప్రయాణికులు డిమాండ్ చేసేలా చేసిందట. అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన లేడీ పైలెట్ ఒకరు తన మాటలతో ప్రయాణికుల్ని హడలెత్తించారు. ఆస్టిన్ నుంచి శాన్ ప్రాన్సిస్ కోకు వెళ్లాల్సిన విమానం టేకాఫ్ అయ్యే టైంలో యూనిఫాం వేసుకోకుండా సాధారణ వస్త్రాలతో వచ్చిన ఆమె.. కాక్ పిట్ లోకి వెళ్లిపోయింది. దీంతో.. ప్రయాణికులు విస్మయానికి గురయ్యారు. ఆమె పైలెట్టా అనుకునే లోపలే.. పబ్లిక్ అనౌన్స్ సిస్టంలో ఇష్టారాజ్యంగా మాట్లాడేయటం మొదలెట్టింది. తాను విమానం నడపాలంటే సాధారణ వస్త్రాలు వేసుకోవచ్చా? యూనిఫాం ధరించాల్సిందేనా? అన్న విషయంపై ప్రయాణికులు తమ అభిప్రాయాన్ని చెప్పాలన్న ఆమె.. తన మాటలకు అక్కడితో పుల్ స్టాప్ వేయలేదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుకొని.. ఆయనపై పోటీ చేసి ఓడిన హిల్లరీ వరకూ అందరిని తిట్టిపోయటం మొదలెట్టింది. ప్రయాణికులు ఎవరికైనా ఓటు వేసి ఉండొచ్చు కానీ.. ఇద్దరు మాత్రం అబద్ధాల కోరులేనని వ్యాఖ్యానించటంతో.. ఈ పైలెట్ ఎక్కడ దొరికారు బాబోయ్ అని ప్రయాణికులు బెదిరిపోయారు. పక్కనున్న వారితో మాట్లాడుతూ.. తాను త్వరలోనే విడాకులు తీసుకోనున్నట్లుగా చెప్పటం కూడా వినిపించిందట.
ఇలా సంబంధం లేని విధంగా వ్యవహరిస్తున్న పైలెట్ వైఖరిపై ప్రయాణికులు బెదిరిపోవటమే కాదు.. సదరు పైలెట్ ను మార్చేయాలని పట్టుబట్టారు. చివరకు ఆమెను విధుల నుంచి తప్పించిన అధికారులు.. ఆమెను ఉద్యోగంలో నుంచితీసేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ తోదాదాపు రెండు గంటల ఆలస్యంగా విమానం బయలుదేరి వెళ్లింది. ఇంతకూ అంత రచ్చ చేసిన పైలెట్ ఎవరన్న విషయం మీద మాత్రం వివరాలుబయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవటం గమనార్హం.