ఏందివయ్యా ఇది... మీరు మీ లాక్ డౌన్ పాడుగాను ఇంట్లో కూర్చోమంటారు తాగడానికి మందివ్వరు - బయట తిరగొద్దంటారు కానీ పెట్రోలు బంకులు ఓపెన్ చేస్తారు... మీరు సెప్పేదొకటి చేసేదొకటా అని చిర్రెత్తిపోతున్నారా.. కంగారుపడకండి ఇది కేరళ వార్త. దేశంలోని జిల్లాలను మూడు జోన్లుగా కేంద్రం విభించిన విషయం తెలిసిందే. సడలింపుల కోసం ఈ విభజన చేశారు. ఈ విభజనలో భాగంగా ఏర్పాటుచేసిన గ్రీన్ జోన్లు - ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభించుకోవచ్చని - అయితే అది రాష్ట్రాల ఇష్టం అని కేంద్రం పేర్కొంది.
దీనిపై సమీక్ష చేసిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజలకు షాక్ చ్చారు. మద్యం అమ్మకాలు నాలుగో తేదీ నుంచి ప్రారంభించే ప్రసక్తే లేదని అన్నారు. మిగతా రాష్ట్రాల కంటే కరోనా కేసులు తక్కువ నమోదవుతున్నా కూడా మద్యం షాపులు ఓపెన్ చేయదలచుకోలేదని ప్రభుత్వం తెలిపింది. అందరికంటే ముందే ఏప్రిల్ 20వ తేదీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఓపెన్ చేసిన కేరళ దాని దుష్పరిణామాలను చవిచూసింది. ఆ దెబ్బతో ప్రభుత్వం ఆలోచనే మారిపోయింది. అందుకే ఏ జోన్ లోను పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ - వైన్ షాపులు ఓపెన్ చేయడం లేదని ముఖ్యమంత్రి ప్రకటించారు. సెలూన్లు - బ్యూాటీ పార్లర్లు - మాల్స్ - పెళ్లిళ్లు గ్రీన్ జోన్ లో కూడా తిరిగి ఇపుడే ప్రారంభించే ఉద్దేశం లేదన్నారు ముఖ్యమంత్రి.