రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకున్నారా ? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీజేపీ బలాన్ని తక్కువగా అంచనా వేయటమే రాహుల్ అసలైన సమస్యగా పీకే వర్ణించారు. దేశంలో బీజేపీ మీద ప్రత్యేకించి నరేంద్ర మోడీ మీద జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోందని రాహుల్ భ్రమల్లో ముణిగిపోయారంటు పీకే చెణుకులు విసిరారు.
రాబోయే కొన్ని దశాబ్దాల పాటు బీజేపీ ప్రభావం దేశంపై ఖాయంగా ఉంటుందన్న పీకే వ్యాఖ్యలు సంచలనంగా మారింది. అయితే మరో 40 ఏళ్ళపాటు బీజేపీనే అధికారంలో ఉంటుందని పీకే చెప్పలేదు. కేవలం బీజేపీ ప్రభావం ఉంటుందని మాత్రమే చెప్పారు. ఇందులో తప్పు కూడా ఏమీ కనబడలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 40 ఏళ్ళపాటు కాంగ్రెస్ ప్రభావం దేశంపై ఎలాగుందో అలాగే మరో 40 ఏళ్ళు బీజేపీ ప్రభావం ఉంటుందన్నారు.
రాజకీయాల పై రాహుల్ అంత సీరియస్ గా ఉన్నట్లు లేరన్న పీకే వ్యాఖ్యలు చాలా కీలకమనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యనే జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో రాహుల్ పాల్గొన్న తీరును చూసిన తర్వాత చాలా మందికి ఇదే అనుమానాలు వచ్చాయి. దేశంలోని గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే మోడీ ఎంత బలంగా ఉన్నారనే విషయం తెలుస్తుందని రాహుల్ ను ఉద్దేశించి పీకే కామెంట్ చేశారు. ప్రజలు ఇప్పటికిప్పుడు బీజేపీనే ఓడిస్తారనే భ్రమల నుంచి రాహుల్ బయటకు రావాలన్నారు. కాంగ్రెస్ కు రాహులే అతిపెద్ద సమస్యగా పీకే తేల్చేశారు.
తాజాగా పీకే చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రాహుల్ ను టార్గెట్ చేసుకున్నట్లు అర్ధమవుతోంది. మొన్నటి వరకు పీకే కాంగ్రెస్ లో చేరబోతున్నారని, కీలకపదవి తీసుకుంటున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే తాజా పరిణామాల్లో పీకే కాంగ్రెస్ కు దూరమవ్వటం ఖాయమైపోయింది. అందుకనే తృణమూల్ తో కలిసి పీకే పనిచేస్తున్నారు. తాజాగా గోవాలో తృణమూల్ కాంగ్రెస్ తరపున పీకే పనిచేస్తున్నారు.
రాహుల్ పై పీకే చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సీరియస్ గా తీసుకుంటే బాగుంటుంది. పార్టీలోని సీనియర్ నేతలను, రాష్ట్రాల్లోని నేతలను నిందించే బదులు ముందు కొడుకును సెట్ రైట్ చేసే విషయంపై సోనియా దృష్టిపెట్టాలి. నిజానికి మోడి మీద వ్యతిరేకత మొదలైపోయిందన్నది వాస్తవం. అయితే దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే పరిస్ధితిలో కాంగ్రెస్ లేదన్నది కూడా అంతే వాస్తవం. అందుకనే సరైన ప్రత్యామ్నాయం లేకే జనాలు బీజేపీకి ఓట్లేస్తున్నారు. బహుశా ఈ విషయాన్నే పీకే స్పష్టంగా ప్రకటించారు.