ప్లేబాయ్‌...మ‌న‌సు పిండేసింది బాస్‌

Update: 2016-02-04 22:30 GMT
ప్లేబాయ్...ఈ పేరు చాలు అందులో న‌షాళానికి అంటే మ‌సాలా ఫొటోలు ఉంటాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేని మ్యాగ‌జైన్ అని తెలుసుకునేందుకు. ఇపుడు ఆపిల్ ఫోన్ రిలీజ్ అవుతుందంటే ఎలా షాపుల వ‌ద్ద తెల్లార‌క ముందే క్యూలైన్లో నిల్చొని ప‌డిగాపులు కాస్తుంటారో అలా ప్లేబాయ్ మ్యాగ‌జైన్ కోసం గ‌తంలో అప్ప‌టి యూత్ నిరీక్షించేవారు. ఈ మ్యాగ‌జైన్‌ లో ఉండే న్యూడ్ ఫొటోలు - కిర్రెక్కించే పోజులు - సెక్సీ మోడ‌ల్స్ స్టిల్స్‌..అబ్బో ప్లేబాయ్‌ ను కోరుకునేవారికి పండుగే పండుగ‌.

అయితే అలా కిరాక్ ఫొటోల‌కు పెట్టింది పేరైన ప్లేబాయ్ తీసుకున్న ఓ నిర్ణ‌యం ఇపుడు సంచ‌ల‌నాత్మ‌కంగా మారింది. కొత్త పాఠకులను ఆకర్షించేందుకు ప్లేబాయ్ వ్యవస్థాగతంగా స‌రికొత్త‌ మార్పున‌కు శ్రీకారం చుట్టి అందులో భాగంగా న్యూడ్ ఫోటోలు లేకుండా నూతన సంచికను మార్కెట్ లోకి రీలీజ్ చేసింది. నగ్న చిత్రాలతో పాటు కార్టూన్లు, పార్టీ జోక్‌లను కూడా ప్లేబాయ్ దూరంగా పెట్టింది. అయితే న్యూడ్ ఫోటోలు లేకున్నా వెలితి ప‌డొద్ద‌ని చెప్తూ...మరో తరహా స్కిన్ షో ఉంటుంద‌ని తెలిపింది. కొత్తగా తాజాగా రిలీజైన సంచికలో పేపర్ నాణ్యతను కూడా పెంచామ‌ని,  ఒక్క నగ్న ఫోటోల మినహా మిగతా పత్రిక మొత్తం యథావిధిగా ఉంటుందని ఆ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్లు తెలిపారు.

అయితే...న్యూడ్ ఫోటోలు లేని ఎడిషన్‌ ను రిలీజ్ చేయాలని ప్లేబాయ్ తన నిర్ణయాన్ని ప్రకటించగానే ఆ పత్రిక పాఠకులు వందల సంఖ్యలో తమ సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నారు. గుండెలు పిండేసేలా ప్లేబాయ్ త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిందని వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో ఇంటర్నెట్‌ లో అశ్లీల చిత్రాలకు హద్దు లేకుండా పోయింది. దాని వల్ల ఆ పత్రిక తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. కానీ చందాదారులు టాటా చెప్పిన‌ప్ప‌టికీ... న్యూడ్‌లెస్ మ్యాగ‌జైన్ ద్వారా కూడా అడ్వటైజర్లను ఆకట్టుకుంటామ‌ని ఎడిటర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News