ఏపీ రాజకీయాల్ని వేడెక్కించిన తిరుపతి ఎంపీస్థానానికి జరుగుతున్నఉప ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ తాజాగా జరుగుతోంది. అయితే.. పోలింగ్ సందర్భంగా వేర్వేరుజిల్లాలకు చెందిన పలువురిని నకిలీ ఓటు స్లిప్పులతో తిరుపతి పట్టణంలోకి తీసుకొస్తున్నట్లుగా టీడీపీ.. కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ.. కాంగ్రెస్ నేతలు.. కార్యకర్తలు పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లనుపట్టుకుంటున్నారు. పోలీసులకు అప్పగిస్తున్నారు. దీంతో.. వాతావరణం వేడెక్కిపోయింది.
ఇదిలా ఉండగా.. పోలింగ్ మొదలైనప్పటి నుంచి పలువురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు టీడీపీ నేతలు.. కార్యకర్తలు. వివిధ జిల్లాల నుంచి వేర్వేరు వాహనాల్లో వస్తున్న వారంతా పీఎల్ఆర్ కల్యాణ మండపం వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. టీడీపీ నేతలు ఆరోపణల ప్రకారం చేస్తే.. మంత్రి పెద్దిరెడ్డి మనుషఉలు సుమారు ఐదు వేల మంది ఇదే కల్యాణమండపంలో పాగా వేసినట్లు చెబుతున్నారు.
ఇంతకీ ఈ కల్యాణ మండపం ఎవరిది? అన్నది ప్రశ్నగా మారింది. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం ఈ కల్యాణమండపం మంత్రి పెద్దిరెడ్డిదేనని చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ కల్యాణ మండపం మీద ఫిర్యాదు చేయటమే కాదు.. దీన్ని తక్షణమే ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ కల్యాణ మండపం వద్ద ఇతర జిల్లాల రిజిస్ట్రేషన్ తో ఉన్న వాహనాలు ఉండటం.. అక్కడున్న వారంతా తిరుపతి స్థానికులు కాదని.. వేర్వేరు జిల్లాల నుంచి వచ్చినట్లుగా ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. దొంగ ఓట్లు వేయటానికి వెళుతున్నారంటూ.. టీడీపీకి చెందిన పలువురు నేతలు.. కార్యకర్తలు పలువురిని పోలీసులకు పట్టించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.