9న మోడీ రాక.. ఏపీ మొత్తం ఆసక్తి

Update: 2019-06-04 10:04 GMT
రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన మోడీ ఎవ్వరి బలం లేకుండానే కేంద్రంలో బలంగా నిలబడ్డారు. ఇప్పుడు తన తొలి పర్యటనగా ఆంధ్రప్రదేశ్ కే వస్తున్నారు. ఎన్నికల్లో గెలిపించిన ఆ దేవ దేవుడు తిరుమల వెంకన్న ఆశీస్సుల కోసం వస్తున్నారు. దీంతో మోడీ తొలి పర్యటనలో ఏపీకి ఏమైనా వరాలిస్తాడా? ప్రత్యేక హోదాపై ఏమైనా ప్రకటన చేస్తాడా అని ప్రజలు, ప్రజసంఘాలు, పార్టీలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

2014లో టీడీపీతో జట్టుకట్టిన మోడీ తిరుమల వెంకన్న సాక్షిగా హోదా ఇస్తానన్నారు. ఏపీ ప్రజలను మోసం చేశారు. అయినా ప్రధాని అయ్యారు. కానీ అంటకాగిన చంద్రబాబు మాత్రం ఓడిపోయారు. మరి రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ఇప్పుడైనా హోదాపై చేసిన హామీ నెరవేరుస్తాడా?  అన్నది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఏపీలో తనకు అనకూలమైన జగన్ అధికారంలోకి రావడం.. చంద్రబాబు చిత్తుగా ఓడిపోవడం.. ఏపీకి న్యాయం చేస్తానని ట్వీట్ చేయడంతో  తన వరాల మూటను మోడీ విప్పుతాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

అయితే కొత్త సీఎం జగన్ గెలవగానే ప్రత్యేక హోదా డిమాండ్ తోనే ప్రధాని మోడీని కలిశారు. మోడీని 30 సార్లు కలిసినా తాను మొదట కోరేది ప్రత్యేకహోదానేనని స్పష్టం చేశారు. తుదివరకు పోరాడుతూనే ఉంటానన్నారు.

ఇక ఏపీ ప్రభుత్వం ఎంత పోరాడుతున్నా.. మోడీ కరుగుతాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇక తిరుమల వస్తున్న మోడీకి స్వాగతం పలికి ఆయన వెన్నంటి ఉండి హోదా కోసం జగన్ ఒత్తిడి తేవాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా డిమాండ్ చేశారు.

ఇక విశాఖకు కేటాయించిన రైల్వే జోన్ పై ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది తలలేని మొండం అంటూ ఆదాయం లేని జోన్ ను ప్రకటించారని ప్రజాసంఘాలు , పార్టీలు విమర్శించాయి. ఈ నేపథ్యంలో ఈనెల 9న తిరుపతికి వస్తున్న మోడీ.. ఏపీకి ఏమైనా వరాలు కురిపిస్తాడా? ఏపీసీఎం జగన్ గెలవగానే ఏపీని ఆదుకుంటానని ప్రకటన చేసిన మోడీ ఆ పని నెరవేరుస్తాడా.. తిరుమల వెంకన్న సాక్షిగా వరాలు కురిపిస్తాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

    

Tags:    

Similar News