ఆ ముగ్గురు కేటుగాళ్లు.. మన చుట్టుపక్కలే ఉంటూ ఆడవాళ్ల నగ్న వీడియోలను చిత్రీకరిస్తారు. వారి బెడ్ రూంలు, బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలను కిటీకల వద్ద ఉంచి చిత్రీకరిస్తారు. ఇలా రెండు మూడేళ్లుగా చేశారు. కానీ అనూహ్యంగా ఒక గొడవలో ఈ వ్యవహారం బయటపడింది. కిటికీలు మరియు గోడల సందుల్లోంచి మహిళల వీడియోలను రికార్డ్ చేశారనే ఆరోపణపై ముగ్గురు బుక్కయ్యారు. ముగ్గురు వ్యక్తులపై లైంగిక నేరాల నుంచి పిల్లలకు కఠినమైన రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు.
నిందితుడి వద్ద ఉన్న నగ్న వీడియోలలో పది మంది మహిళలు, ఒక మైనర్ బాలిక ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రహస్యంగా వీడియోల చిత్రీకరణ 2019-2020లో మొదులపెట్టారని.. సెవ్రీలోని దారుఖానాలో నివసిస్తున్న నిందితులలో ఒకరు స్థానికుడితో వాగ్వాదానికి దిగడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిందితుడు తన బంధువుకు సంబంధించిన వీడియోను కలిగి ఉన్నాడని తెలుసుకున్న వ్యక్తి ఆమెను అప్రమత్తం చేయడంతో కేసు పోలీసులకు చేరింది. విచారణలో పోలీసులు సతీష్ హరిజన్(29); స్టిఫెన్ నాడార్(21); సర్వనా హరిజన్(23) లపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంలోని సెక్షన్లతో పాటు అశ్లీల వస్తువులను పంపిణీ చేయడం.. వోయూరిజం ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. రమేష్ హరిజన్ నిందితులకు సహాయం చేశాడనే ఆరోపణలపై తరువాత పట్టుకున్నారు.
సతీష్, రమేష్ హరిజన్ వృత్తిరీత్యా స్వీపర్లు కాగా.. స్టిఫెన్ నాడార్ ఓ ప్రైవేట్ కంపెనీలో క్లీనర్. దారుఖానాలో నివసిస్తున్న ఈ నలుగురు ముఠాగా ఏర్పడి ఇలా మహిళల నగ్న వీడియోలు చిత్రీకరించడం మొదలుపెట్టారు. వీరు ఇఫ్పుడు పోలీసు కస్టడీలో ఉన్నారు. 14 రోజుల పోలీసు రిమాండ్ తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తారు.
నిందితుడి మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్‌ల నుంచి 30కి పైగా మహిళల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాళ్లు వీడియోలో చిక్కాక వాటిని చూపించి తమ కోరిక తీర్చాలని.. లేదంటే సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించి లొంగదీసుకున్నట్టు తెలిసింది. లైంగిక వేధింపుల కోసం నిందితులు ఈ వీడియోలను ఉపయోగించుకున్నట్లు విచారణలో తేలింది.
పోర్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ గీతా చవాన్ మాట్లాడుతూ "ఈ ప్రాంతానికి చెందిన మహిళలను వ్యక్తిగతంగా కలిశాను. నిందితులు ఎవరైనా బెదిరిస్తే ముందుకు రావాలని కోరారు. అయితే, బాధితులు ఎవరూ అలాంటి బెదిరింపులపై ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు' తెలిపారు. మరి ఈ రహస్య వీడియోల దందాలో తీగలాగితే ఎలాంటివి బయటపడుతాయన్నది వేచిచూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.