పాకిస్తాన్ లో వింత ఘటన: ఈ వార్త చదివితే నవ్వులే..

Update: 2020-06-12 02:30 GMT
పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం రహీం యార్‌ఖాన్‌ నగరంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలిస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసిన సందర్భంలో ఓ గాడిదను అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆ పేకాటలో డబ్బులకు బదులు ఓ గాడిదను పందెంగా పెట్టారు. ఈ విషయం ఓ జర్నలిస్ట్ వీడియో విడుదల చేయడంతో తెగ వైరలైంది.

రహీమ్ యార్ ఖాన్ పట్టణంలో కొందరు జూదం ఆడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా ఆ పేకాట స్థావరంపై దాడి చేశారు. వెంటనే పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్‌ చేశారు. వారితో పాటు ఒక గాడిదను కూడా అరెస్ట్‌ చేశారు. ఎందుకంటే వారు గాడిదను పందెంగా పెట్టి జూదం ఆడుతున్నారు. ఈ జూదంలో గాడిద కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పడం కొత్తగా ఉంది. దీంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దానిలో 8మంది పేకాట ఆడిన వారితో పాటు గాడిదపై కూడా కేసు నమోదు చేశారు. మొత్తం 9 మంది నిందితుల్లో గాడిద కూడా ఉండడం విశేషం. వారి వద్ద నుంచి పోలీసులు రూ. 1.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌ నైలా ఇనాయత్‌ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు నవ్వుతున్నారు. ట్వీట్లు, రీట్వీట్లు, కామెంట్స్ తో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.
Tags:    

Similar News